
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఎప్పుడూ ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తుంటారు. బీటౌన్ నెపోటిజంపై ఎన్నోసార్లు సూటిగా కామెంట్స్ చేసి హాట్ టాపిక్ అయ్యింది. ఇండస్ట్రీలో యంగ్ స్టర్స్, స్టార్ కిడ్స్ యాక్టింగ్ పై అనేకసార్లు తీవ్ర విమర్శలు చేసింది. అలాగే కొన్నాళ్లుగా కంగనా నటించిన ఎమర్జెన్సీ సినిమాపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. విడుదలకు ముందే ఈ మూవీకి ఎన్నో అడ్డంకులు ఏర్పడ్డాయి. సెన్సార్ సర్టిఫికేట్ పొందడానికి నటి చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. నటి కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఇప్పుడు సినిమా విడుదలైన తర్వాత కూడా కంగనా కష్టాలు ఎక్కువైనట్లు తెలుస్తోంది. జనవరి 17న ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. అయితే రిలీజ్ రోజున సైతం పలు చోట్ల ఈ సినిమాకు వ్యతిరేకత వస్తుంది.
పంజాబ్‌లో కంగనా చిత్రాన్ని విడుదల చేస్తే థియేటర్ల బయట నిరసనలు చేస్తామని శిరోమణి గురుద్వారా పరబంధక్ సమితి (SGPC) ఇప్పటికే ప్రకటించింది. కానీ ఈరోజు సినిమా రిలీజ్ కావడంతో పంజాబ్ లోని సిక్కులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో అమృత్‌సర్‌లోని సినిమా బయట భారీ సంఖ్యలో ఎస్జీపీసీ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఎమర్జెన్సీ చిత్రంపై బ్యాన్ విధించాలని ఎస్జీపీసీ పంజాబ్ సర్కార్ ను కోరింది. అలాగే రాష్ట్రంలోని అన్ని సినిమా హాళ్లలో షోలను రద్దు చేయాలని కోరింది. పరిస్థితి చేయిదాటి.. ఏదైనా జరిగితే పంజాబ్ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని కమిటీ పేర్కొంది.
కాంగ్రెస్ ఎంపీ, పంజాబ్ చీఫ్ అమరిందర్ సింగ్ రాజా మాట్లాడుతూ.. “ఇలాంటి సినిమాలు తీసినప్పుడు.. ఆ చిత్రాల్లో వాస్తవాలను వక్రీకరిస్తారు” అన్నారు. మసాలా లేకుండా సినిమా సక్సెస్ కాదన్నారు. ప్రజలను ఎంటర్టైన్ చేసేందుకే ఇలాంటి సినిమాలు చేయడం సరికాదన్నారు. సినిమాలో చూపించింది ఏది నిజం కాదని.. అది కేవలం స్ర్కిప్టు మాత్రమే అని అన్నారు.
కంగనా రనౌత్ ‘ఎమర్జెన్సీ’ సినిమాను మొదట గురుద్వారా కమిటీ వ్యతిరేకించింది. గత ఏడాది కూడా ఈ సినిమా ట్రైలర్‌పై సిక్కు సంస్థలు నిరసన తెలిపాయి. ఇది చూసిన సెన్సార్ బోర్డు తన సర్టిఫికేషన్‌ను నిలిపివేసింది. సినిమాలో చాలా మార్పులు సూచించిన తర్వాత ఎగ్జిబిషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..