Shahid Kapoor: ఆ ఇద్దరూ నన్ను మోసం చేశారు.. బాలీవుడ్ స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్..

నేహా ధూపియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు. పెళ్లికి ముందు తన మాజీ ప్రియురాళ్లు తను మోసం చేశారని.. ప్రేమ కోసం చేసిన ప్రయత్నాలు అన్ని దురదృష్టకరమని వెల్లడించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది.

Shahid Kapoor: ఆ ఇద్దరూ నన్ను మోసం చేశారు.. బాలీవుడ్ స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్..
Shahid Kapoor

Updated on: May 05, 2024 | 8:04 AM

బాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో షాహిద్ కపూర్ ఒకరు. వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ తనదైన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. కబీర్ సింగ్, జెర్సీ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. కెరీర్ పరంగా సక్సెస్ ఫుల్ హీరోగా స్టార్ డమ్ అందుకున్న షాహిద్.. నిజ జీవితంలో మాత్రం ప్రేమలో ఒడిపోయాడు. లవ్, బ్రేకప్ గురించి ఆసక్తి కామెంట్స్ చేశాడు. నేహా ధూపియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు. పెళ్లికి ముందు తన మాజీ ప్రియురాళ్లు తను మోసం చేశారని.. ప్రేమ కోసం చేసిన ప్రయత్నాలు అన్ని దురదృష్టకరమని వెల్లడించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది.

ప్రేమలో ఎన్నిసార్లు మోసపోయావని నేహా అడగ్గా.. షాహిద్ ఒక్కసారిగా నవ్వేశాడు. “ఒక మోసం గురించి నాకు తెలుసు. నేను కచ్చితంగా దాని గురించి మాట్లాడగలను. కానీ మరొకదాని గురించి చాలా పెద్ద సందేహాలు ఉన్నాయి. కాబట్టి వాటి గురించి మాట్లాడాకూడదని అనుకుంటున్నాను. వాటికి నేను ఎలాంటి పేరు పెట్టను” అని అన్నారు. ఇక నేహా స్పందిస్తూ.. మీరు డేటింగ్ చేసిన ఇద్దరు మహిళలు (కరీనా కపూర్, ప్రియాంక చోప్రా) గురించా ? అని అడగ్గా.. షాహిద్ స్పందించేందుకు నిరాకరించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుంది.

లవ్ ఫెయిల్యూర్స్ నుంచి తాను చాలా విషయాలు నేర్చుకున్నాని.. మనం చూస్తున్నది ఏదైనా కొన్నిసార్లు కరెక్ట్ కాకపోవచ్చు.. అదే ఇప్పుడు సక్సెస్ అయిన అబ్బాయిలకు పెద్ద సమస్యగా ఉంటుంది. ఎప్పుడూ తాము సరైనవారు అనుకుంటారు. కానీ అది నిజం కాదు అని అన్నారు. షాహిద్ కపూర్ 2015లో మీరా రాజ్ పుత్ ను వివాహం చేసుకున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలోని మోస్ట్ బ్యూటీఫుల్ జంటలలో ఈ జోడి ఒకటి. ప్రస్తుతం షాహిద్ తన భార్య మీరాతో కలిసి సంతోషంగా ఉన్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. వీరికి ఒక పాప, బాబు సంతానం.

How Many Women’s Cheated on Shahid Kapoor?
byu/Haterskahater inBollyBlindsNGossip

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.