
గతేడాదిలో ఏకంగా మూడు బ్లాక్ బస్టర్స్ ఖాతాలో వేసుకున్నాడు బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్. ఒక్క సంవత్సరంలోనే దాదాపు రూ.2 వేల కోట్లకుపై పైగా సంపాదించి అరుదైన ఘనత అందుకున్నాడు. 2018లో జీరో సినిమా అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది. దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత పఠాన్ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. షారుఖ్, దీపికా పదుకొణె కలిసి నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద తిరుగులేని రారాజు అని మరోసారి నిరూపించుకున్నాడు బాద్ షా. వరుస పరాజయాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న బీటౌన్ కు పుర్వ వైభవం తీసుకొచ్చాడు. ఇక ఆ తర్వాత కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో జవాన్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించాడు. ఏడాదిలో విడుదలైన ఈ సినిమాకు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. వరుసగా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరించిన షారుఖ్.. ఆ తర్వాత డంకీ సినిమాతో పలకరించాడు.
డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వంలో షారుఖ్ నటించిన సినిమా డంకీ. ఇందులో తాప్సీ పన్నూ, విక్కీ కౌశల్ కీలకపాత్రలు పోషించారు. గతేడాది చివర్లో విడుదలైన ఈ సినిమాకు మంచి రివ్యూస్ వచ్చాయి. ముఖ్యంగా చాలా కాలం తర్వాత మరోసారి తన కామెడీ టైమింగ్ తో నవ్వించడం.. అద్భుత నటనతో ఎమోషనల్ డ్రామాతో మెప్పించాడు. కానీ ఊహించిన రేంజ్ లో వసూళ్లు రాబట్టలేకపోయింది. ఇప్పుడు ఈ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకమైన అకాడమీ అవార్డ్స్ 2024 కోసం పోటీ పడనుందని తెలుస్తోంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి ఎలాంటి అఫీషియల్ ప్రకటన రాలేదు.
స్వదేస్, పహేలీ తర్వాత ఆస్కార్ కోసం పోటిపడనున్న షారుఖ్ మూడవ చిత్రం ఇదే కావడం విశేషం. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన పఠాన్ అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్ల మార్కును దాటిన 2023లో మొదటి బాలీవుడ్ చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత అట్లీ తెరకెక్కించిన జవాన్.. ప్రపంచవ్యాప్తంగా రూ. 1148.32 కోట్లతో అత్యధిక వసూళ్లు చేసిని సినిమాగా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన డంకీ సినిమా రూ.400 కోట్ల మార్క్ దాటింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.