Shah Rukh Khan: జైలుకెళ్లి తనయుడు ఆర్యన్‌ను కలిసిన బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ఖాన్

|

Oct 21, 2021 | 11:01 AM

ముంబై ఆర్థర్‌ రోడ్‌ జైలుకెళ్లారు బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ఖాన్. ముంబై క్రూయిజ్‌ డ్రగ్‌ కేసులో జైల్లో ఉన్న కొడుకు ఆర్యన్‌ను కలిశారు.

Shah Rukh Khan: జైలుకెళ్లి తనయుడు ఆర్యన్‌ను కలిసిన బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ఖాన్
Shah Rukh Khan
Follow us on

ముంబై ఆర్థర్‌ రోడ్‌ జైలుకెళ్లారు బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ఖాన్. ముంబై క్రూయిజ్‌ డ్రగ్‌ కేసులో జైల్లో ఉన్న కొడుకు ఆర్యన్‌ను కలిశారు. ఆర్యన్‌కు బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించింది ముంబై సెషన్స్‌ కోర్ట్‌. తనయుడి అరెస్ట్ తర్వాత షారుక్ తొలిసారి బయట కనిపించారు.  ఇప్పటికే ఆర్యన్‌ బెయిల్‌ పిటిషన్‌ను మూడుసార్లు తిరస్కరించింది కోర్ట్‌. డ్రగ్స్‌ పెడ్లర్స్‌తో ఆర్యన్‌కు సంబంధాలున్నాయని..అందుకు ఆధారాలను కూడా కోర్టుకు సమర్పించింది ఎన్సీబీ. ఓ హీరోయిన్‌తో ఆర్యన్‌ చేసిన చాటింగ్‌ను కూడా కోర్టు ముందుంచారు. ఆర్యన్‌కు బెయిల్‌ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేస్తారన్న ఎన్సీబీ వాదనతో ఏకీభవించిన కోర్టు..ఆర్యన్‌కు బెయిల్‌ ఇచ్చేందుకు తిరస్కరించింది. చివరి వరకు ఆర్యన్‌కు బెయిల్‌ వస్తుందని ఆశతో ఉన్న షారుఖ్‌ కుటుంబం..బెయిల్‌ రాకపోవడంతో తీవ్ర నిరాశలో మునిగిపోయింది. ఇక ఇప్పుడు ముంబై హైకోర్టుపైనే ఆశలు పెట్టుకున్న షారుఖ్‌..కొడుకు బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నారు.

అక్టోబర్‌ 3న గోవాకు చెందిన క్రూయిజ్ షిప్‌లో ఎన్​సీబీ అధికారులు జరిపిన దాడుల్లో ఆర్యన్‌ ఖాన్‌, మూన్‌మూన్‌ ధామేచ, అర్బాజ్‌ మెర్చంట్‌ సహా ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. వీరిని కొన్నిరోజుల క్రితం న్యాయస్థానంలో హాజరు పరచగా.. తదుపరి దర్యాప్తు నిమిత్తం ఎన్సీబీకి అప్పగించింది. ఆ కస్టడీ ముగియడం వల్ల మరోసారి నిందితులను అధికారులు కోర్టులో హాజరుపరచగా.. ఆర్యన్‌ సహా ఎనిమిది మందికి న్యాయస్థానం జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది.

Also Read: Viral Video: పాముకు సుస్సు పోయించిన ముంగిస.. వార్ వన్‌ సైడ్

 చివరకు సీఎం తల్లిని తిడుతున్నారు.. పట్టాభి బూతు వ్యాఖ్యలపై సీఎం జగన్ ఫైర్