రామ మందిరం ప్రారంభోత్సవం.. ఆ ముగ్గురు స్టార్ హీరోలకు అందని ఆహ్వానం

పలువురు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సినీ నటుల పేర్లు ఆహ్వాన జాబితాలో ఉన్నాయి. ఆహ్వాన పత్రికకు సంబంధించిన ఫోటో ఇప్పటికే వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే సినీ ఇండస్ట్రీకి చెందిన కొందరు ప్రముఖులకు ఆహ్వానం అందలేదని తెలుస్తోంది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

రామ మందిరం ప్రారంభోత్సవం.. ఆ ముగ్గురు స్టార్ హీరోలకు అందని ఆహ్వానం
Rama Mandiram

Updated on: Jan 19, 2024 | 6:45 PM

జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం ఘనంగా జరగనుంది. రామ మందిర ప్రారంభోత్సవానికి హాజరుకావాలని పలువురు ప్రముఖులకు ఆహ్వానం అందింది. పలువురు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సినీ నటుల పేర్లు ఆహ్వాన జాబితాలో ఉన్నాయి. ఆహ్వాన పత్రికకు సంబంధించిన ఫోటో ఇప్పటికే వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే సినీ ఇండస్ట్రీకి చెందిన కొందరు ప్రముఖులకు ఆహ్వానం అందలేదని తెలుస్తోంది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్ లకు రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందలేదు అని టాక్ వినిపిస్తుంది.

షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ బాలీవుడ్ లో స్టార్ హీరోలుగా రాణిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ ముగ్గురు హీరోలకు విపరీతమైన క్రేజ్ ఉంది. రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనే ప్రముఖుల జాబితాలో ఈ ముగ్గురికి చోటు దక్కకపోవడంతో అంతా షాక్ అవుతున్నారు. అంతే కాకుండా చాలా మంది సెలబ్రిటీలకు ఆహ్వాన పత్రం అందలేదు. దీంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.ప్రముఖ హిందీ సినీ నటుడు అమితాబ్ బచ్చన్‌కు ఆహ్వానం అందింది. కానీ ఆయన కోడలు, ప్రముఖ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్‌కు మాత్రం ఆహ్వానం అందలేదు. రణవీర్ సింగ్, దీపికా పదుకొనే, కత్రినా కైఫ్, కరీనా కపూర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, కరణ్ జోహార్, శిల్పా శెట్టి, సంజయ్ దత్ కు కూడా ఆహ్వానం అందలేదు. చివరగా ఈ వేడుకలో ఏ సెలబ్రిటీలు పాల్గొంటారో వేచి చూడాలి. అక్షయ్ కుమార్, రజనీకాంత్, ఆయుష్మాన్ ఖురానా, కంగనా రనౌత్, అలియా భట్, రణ్‌బీర్ కపూర్, రణదీప్ హుడా, అనుష్క శర్మ, రజనీకాంత్, అనుపమ్ ఖేర్, మాధురీ దీక్షిత్, రిషబ్ శెట్టి, యష్, అజయ్ దేవగన్, ప్రభాస్, సన్నీల్ సంయోల్, రామ్ చరణ్, సంజయ్ లీలా బన్సాలీ, చిరంజీవితో పాటు పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి