Shah Rukh Khan: తగ్గేదే లే అంటున్న షారుఖ్ .. డంకీ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన కింగ్ ఖాన్..

|

Sep 28, 2023 | 11:37 AM

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ఫుల్ జోష్ లో ఉన్నారు. షారుఖ్ ఖాన్ ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ రెండు బ్లాక్ బస్టర్ హిట్స్  అందుకున్నారు. ‘పఠాన్‌’ , ‘ జవాన్‌ ’ రెండు సినిమాలు విజయవంతమయ్యాయి. ఇక ఇప్పుడు మూడో సినిమాకు రెడీ అయ్యాడు. పఠాన్ సినిమా , జవాన్ మూవీ రెండు వెయ్యి కోట్లకు పైగా కలెక్ట్ చేసి రికార్డ్స్ క్రియేట్ చేశాడు షారుఖ్. ఒకే ఏడాది రెండు సినిమాలతో వెయ్యి […]

Shah Rukh Khan: తగ్గేదే లే అంటున్న షారుఖ్ .. డంకీ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన కింగ్ ఖాన్..
Shah Rukh Khan
Follow us on

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ఫుల్ జోష్ లో ఉన్నారు. షారుఖ్ ఖాన్ ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ రెండు బ్లాక్ బస్టర్ హిట్స్  అందుకున్నారు. ‘పఠాన్‌’ , ‘ జవాన్‌ ’ రెండు సినిమాలు విజయవంతమయ్యాయి. ఇక ఇప్పుడు మూడో సినిమాకు రెడీ అయ్యాడు. పఠాన్ సినిమా , జవాన్ మూవీ రెండు వెయ్యి కోట్లకు పైగా కలెక్ట్ చేసి రికార్డ్స్ క్రియేట్ చేశాడు షారుఖ్. ఒకే ఏడాది రెండు సినిమాలతో వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన హీరో షారుఖ్ తప్ప మరొకరు లేరు. అట్లీ దర్శకత్వంలో వచ్చిన జవాన్ సినిమాలో షారుఖ్ ఖాన్ డ్యూయల్ రోల్లో నటించి మెప్పించారు. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించింది. ఇక ఇప్పుడు ఇదే ఏడాది మూడో హిట్ కొట్టి హ్యాట్రిక్ సాధించాలని చూస్తున్నాడు. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్‌లో ‘డంకీ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లుఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ సినిమా  పడుతుందని ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా దీని పై కింగ్ ఖాన్ క్లారిటీ ఇచ్చాడు.

డంకీ రిలీజ్ లో ఎలాంటి మార్పు లేదని షారుఖ్ ఖాన్ స్పష్టం చేశారు. దాంతో ఆయన ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. డిసెంబర్‌లో భారీ బడ్జెట్ సినిమాలు విడుదల కానున్నాయి. షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ విడుదల తేదీ ఆలస్యమైంది. సినిమా పనులు పూర్తి కాకపోవడంతో సినిమా విడుదల తేదీని వాయిదా వేసుకున్నాడు. అనుకున్న దానికంటే రెండు నెలలు ఆలస్యంగా సినిమా విడుదలైంది జవాన్. ‘డంకీ’ సినిమా కూడా ఇలాగే  ఆలస్యం అవుతుందని చాలామంది అంచనా వేశారు. కానీ, అలా కాదు. ‘డంకీ’ సినిమా విడుదల తేదీ ఆలస్యం కాదు అని స్పష్టం చేశారు షారుఖ్.

షారుక్ ఖాన్ తరచుగా ఆస్క్ ఎస్.ఆర్.కే  సెషన్లను నిర్వహిస్తారు. ఈ సమయంలో డంకీ విడుదల తేదీని ఫిక్స్ చేయమని షారుక్ ఖాన్‌ను అడిగారు కొందరు నెటిజన్స్. దాంతో ‘డంకీ డేట్ ఫిక్స్’ అయ్యిందని. అనుకున్న తేదీకి సినిమా రిలీజ్ అవుతుందని క్లారిటీ ఇచ్చారు.  దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ నటించిన సాలార్ కూడా డిసెంబర్ 22న విడుదల కానుందని అంటున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలో వెలువడనుంది. ఈసారి బాక్సాఫీస్ వద్ద ‘సాలార్’ వర్సెస్ ‘డంకీ’ పోటీ జరగనుంది. మరి వీటిలో ఏ సినిమా విజయం సాధిస్తుందో వేచి చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.