సినీ పరిశ్రమలో ఒక్కసారి ఫేమ్ వచ్చిందంటే చాలు.. జీవితాంతం వాళ్లను ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ఇక వరుసగా సూపర్ హిట్ చిత్రాల్ల .. వారి నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ సాధారణంగా ప్రజలు సెలబ్రెటీలను గుర్తుపట్టకపోవడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. అందులోనూ.. వందలాది చిత్రాల్లో నటించి… నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటీనటులను గుర్తుపట్టలేని వారు కూడా ఉంటారు. కానీ బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కు అలాంటి పరిస్థితి ఎదురైంది.
సినిమాలను ఇష్టపడే ప్రతి ఒక్కరికి ఆయన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కానీ ఆయన సొంత ప్రాంతానికి చెందిన వ్యక్తి ఆయనను గుర్తుపట్టలేదు. నేనెవరలో తెలుసా ? అని అడిగితే తెలియదు అని చెప్పాడట. ఈ విషయాన్ని అనుపమ్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. దేశంలో కరోనా రెండో దశ వేగంగా వ్యాపిస్తుడడంతో అనుపమ్ తన స్వగ్రామం అయిన సిమ్లాకు వెళ్లిపోయారు. ఇటీవల ఓరోజు మార్నింగ్ వాక్ కు వెళ్లారు. అక్కడ జ్ఞాన్ చంద్ అనే వ్యక్తి కనిపిస్తే.. మాస్క్ తో ఉన్న అనుపమ్ నేనెవరో తెలుసా ? అని అడిగారట. అందుకు ఆ వ్యక్తి బదులుగా తెలియదు అన్నాడట. ఆ తర్వాత మాస్క్ తీసి మళ్లీ ఇప్పుడైన గుర్తుపట్టావా ? అడి అడిగారట. ఇందుకు కూడా జ్ఞాన్ చంద్ తల అడ్డంగా ఊపేశాడట. ఆ క్షణంలో తన మనసులో అనిపించిన భావాలను ప్రపంచానికి తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టు చేశారు. దానికి ఆ వ్యక్తితో కలిసి దిగిన ఫొటోను కూడా షేర్ చేశారు. ”నేను 518 చిత్రాల్లో నటించానని గర్వంగా చెప్పుకుంటాను. నన్ను ఇండియాలో అందరూ గుర్తిస్తారని ఇంతకాలం అనుకున్నాను. కానీ.. జ్ఞాన్ చంద్ నా విశ్వాసాన్ని బద్దలు కొట్టేశాడు. నేనెవరో తనకు కొంచెం కూడా తెలియదు. ఈ విషయం కాస్త బాధించినా.. ఈ అనుభవం ఎంతో గొప్పది. నన్ను గుర్తుపట్టకపోవడం వల్ల జ్ఞాన్ చంద్ నా కాళ్లను భూమ్మీదే ఉండేలా పాఠం నేర్పాడు” అని రాశారు అనుపమ్.