
సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ తన వ్యక్తిగత జీవితం కారణంగా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటోంది. కొన్నిసార్లు తన బాలీవుడ్ స్నేహితులతో పార్టీ లు చేసుకుంటూ కనిపిస్తుంటుందీ స్టార్ కిడ్. అలాగే టీమిండియా క్రికెటర్ శుభ్‌మాన్ గిల్‌తో సారా డేటింగ్ లో ఉందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. కానీ కొన్ని రోజుల క్రితం వారిద్దరూ విడిపోయారని సమాచారం. అంతే కాదు, ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేశారని పుకార్లు కూడా వినిపించాయి. అయితే ఈ రూమర్లపై అటు సారా కానీ ఇటు గిల్ కానీ ఎప్పుడూ అధికారిక ప్రకటన చేయలేదు. కాగా ఇప్పుడు సారా టెండూల్కర్ జీవితంలోకి కొత్త వ్యక్తి ప్రవేశించాడని బాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. సారాతో లింక్ చేయబడుతున్న వ్యక్తి మరెవరో కాదు ‘గల్లీ బాయ్’ ఫేమ్ నటుడు సిద్ధాంత్ చతుర్వేది. ప్రస్తుతం సారా, సిద్ధాంత్ డేటింగ్ లో ఉన్నారంటూ హిందీ చిత్ర పరిశ్రమలో తెగ ప్రచారం జరుగుతోంది. అయితే వీరిద్దరు మంచి స్నేహితులని, అందుకే ఇలా ప్రేమ పుకార్లు వినిపిస్తున్నాయంటున్నారు కొందరు. అయితే ఈ విషయంపై అటు సారా కానీ సిద్ధాంత్ కానీ స్పందించిన దాఖలాలు లేవు.
సిద్ధాంత్ చతుర్వేది తన సినిమాలతో పాటు తన వ్యక్తిగత జీవితంతోనూ తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఇంతకు ముందు మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలితో సిద్ధాంత్ డేటింగ్ చేసినట్లు రూమర్స్ వినిపించాయి. అందుకు తగ్గట్టుగానే ఇద్దరూ తరచుగా కలిసి కనిపించేవారు. అయితే అకస్మాత్తుగా వీరిద్దరు విడిపోయారని టాక్.
సిద్ధాంత్ సినిమా కెరీర్ గురించి మాట్లాడుకుంటే.. ఇప్పటివరకు 5 సినిమాల్లో నటించాడీ హ్యాండ్సమ్ హీరో. అయితే ‘దీపికతో కలిసి నటించిన గెహ్రాయాన్ సినిమాతోనే సిద్ధాంత్ కు మంచి గుర్తిపు ఉంది. ఇందులో దీపికతో కలిసి రొమాంటిక్ సన్నివేశాల్లో నటించాడీ హీరో. ఇప్పుడు సిద్ధాంత్ దిల్ కా దర్వాజా ఖోల్ నా డార్లింగ్ సినిమాతో అభిమానులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు.
సారా గురించి చెప్పాలంటే, ఆమె నటి కాకపోయినా, సారా తన వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో నిలిచింది. ఒక ఇంటర్వ్యూలో, శుభ్‌మాన్ సారాతో తనకున్న స్నేహాన్ని ఒప్పుకుంది. కానీ కొన్ని రోజుల క్రితం, ఇద్దరూ ఒకరినొకరు బ్లాక్ చేసుకున్నట్లు తెలుస్తంది.
సారా ఎప్పుడూ తన ఫోటోషూట్‌లు, వెకేషన్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. ప్రస్తుతం సమ్మర్ వెకేషన్ లో భాగంగా ఆస్ట్రేలియాలో సేద తీరుతోంది సారా.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.