Rhea Chakraborty: ‘సుశాంత్‏ను లేకుండా జీవించడం కష్టంగా ఉంది.. మిస్ అవుతున్నాను’.. రియా చక్రవర్తి కామెంట్స్..

|

Oct 06, 2023 | 4:31 PM

సుశాంత్ మరణించి మూడేళ్లు దాటినా ఇప్పటికీ దర్యాప్తు మాత్రం పూర్తి చేయలేకపోయింది. కానీ అతని సుసైడ్ కేసులో మాత్రం సుశాంత్ స్నేహితురాలు రియా చక్రవర్తి ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. రియాతోపాటు ఆమె సోదరుడు షోక్ సైతం పలు వారాలు పోలీసు కస్టడీలో ఉన్నారు. చాలా కాలంపాటు జైలులో ఉన్న రియా.. విడుదలైన తర్వాత మీడియాకు దూరంగా ఉన్నారు. చాలా సార్లు మీడియా ముందుకు రావడానికి ఆమె ఆసక్తి చూపించలేదు. ఇటీవల జరిగిన ఇండియా టుడే కాన్క్లేవ్ 2023లో పాల్గొన్న రియా..

Rhea Chakraborty: సుశాంత్‏ను లేకుండా జీవించడం కష్టంగా ఉంది.. మిస్ అవుతున్నాను.. రియా చక్రవర్తి కామెంట్స్..
Sushanth Singh Rajputh, Rhe
Follow us on

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం ఇప్పటికీ వీడని మిస్టరీ. అప్పటివరకు ఎంతో సరదాగా కనిపించిన సుశాంత్ గంటల వ్యవధిలోనే తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం అందరిని షాక్‏కు గురి చేసింది. అయితే సుశాంత్‏ది సూసైడ్ కాదని ఆరోపించడంతో ఈ కేసును సీబీఐ టేకప్ చేసింది. సుశాంత్ మరణించి మూడేళ్లు దాటినా ఇప్పటికీ దర్యాప్తు మాత్రం పూర్తి చేయలేకపోయింది. కానీ అతని సుసైడ్ కేసులో మాత్రం సుశాంత్ స్నేహితురాలు రియా చక్రవర్తి ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. రియాతోపాటు ఆమె సోదరుడు షోక్ సైతం పలు వారాలు పోలీసు కస్టడీలో ఉన్నారు. చాలా కాలంపాటు జైలులో ఉన్న రియా.. విడుదలైన తర్వాత మీడియాకు దూరంగా ఉన్నారు. చాలా సార్లు మీడియా ముందుకు రావడానికి ఆమె ఆసక్తి చూపించలేదు. ఇటీవల జరిగిన ఇండియా టుడే కాన్క్లేవ్ 2023లో పాల్గొన్న రియా.. సుశాంత్ మరణం తర్వాత తన ఎదుర్కొన్న పరిస్థితులు, జైలు శిక్ష గురించి వెల్లడించింది.

“మన జీవితంలో ఏం జరిగిన ముందుకు వెళ్లడమనేది మనల్ని మనుషుగా మార్చే ఒక విషయం. జీవితంలో ముఖ్యమైన వ్యక్తిని కోల్పోయాను. ఆ విషాదం నుంచి నేను మాములు మనిషిని కావడానికి చాలా సమయం పట్టింది. మీడియాలో నాపై ఎన్నో కథానాలు వచ్చాయి. వాటి వల్ల నేను చాలా నష్టపోయాను. కానీ జీవితంలో నేను ముందుకు వెళ్లడానికి ఎదురుచూస్తున్నాను. మళ్లీ సాధారణ జీవితాన్ని గడపడం చాలా కష్టం. నేను ఏడవడానికి కూడా నాకు సమయం ఇవ్వలేదు. ఎన్నో సంఘర్షణలను దాటి వచ్చాను. సుశాంత్ లేని లోటు ఎప్పటికీ తీర్చలేనిది. నా జీవితమంతా అతడిని మిస్ అవుతూనే ఉంటాను. నా స్నేహితుడు లేకుండా జీవించడం చాలా కష్టం. కానీ ముందుకు వెళ్లడం తప్పదు.

జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా ముందుకు వెళ్లాలని మా నాన్న నాకు నేర్పారు. నా జీవితంలో ఏర్పడిన ఈ లోటు ఎప్పటికీ తీర్చలేనిది. నేను ప్రతిక్షణం సుశాంత్ ను మిస్ అవుతున్నాను. కానీ మా ఇద్దరి జీవితాల్లో నష్టం జరిగింది. ఇప్పుడు నేను ముందుకు సాగాలి. ” అంటూ చెప్పుకొచ్చింది. సుశాంత్ మరణం తర్వాత సోషల్ మీడియాలో తనను చుడైల్ (మంత్రగత్తె ) అంటూ ట్రోలింగ్ జరిగింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.