Dhurandhar: థియేటర్లలో రికార్డు కలెక్షన్లు.. భారీ ధరకు అమ్ముడుపోయిన ధురంధర్ ఓటీటీ రైట్స్.. ఏకంగా అన్ని కోట్లా?

'ధురంధర్' చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను OTT ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకుంది. ఇందు కోసం చిత్ర నిర్మాతలకు వందల కోట్ల చెల్లించిందని సమాచారం. ఆదిత్య ధార్ తెరకెక్కించిన ఈ సినిమా థియేటర్లలో రికార్డు కలెక్షన్లు రాబడుతోంది. విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది.

Dhurandhar: థియేటర్లలో రికార్డు కలెక్షన్లు.. భారీ ధరకు అమ్ముడుపోయిన ధురంధర్ ఓటీటీ రైట్స్.. ఏకంగా అన్ని కోట్లా?
Dhurandhar Movie

Updated on: Dec 10, 2025 | 9:37 AM

‘ఉరి’ మూవీ ఫేమ్ ఆదిత్య ధార్ దర్శకత్వం వహించిన మల్టీస్టారర్ చిత్రం ‘ధురంధర్’ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతోంది. అంతే కాదు, చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ చిత్రాన్ని చూసి తెగ పొగిడేస్తున్నారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మార్కును దాటింది. బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు సాధిస్తోన్న ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కూడా రికార్డు ధర పలికాయి. ‘ధురంధర్’ డిజిటల్ హక్కులు నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకుంది. అందుతున్న సమాచారం ప్రకారం ‘ ధురంధర్’ OTT హక్కులు ఏకంగా రూ.130 కోట్లకు అమ్ముడయ్యాయి. ‘ధురంధర్’ రెండవ భాగం కూడా కొత్త సంవత్సరం మార్చి నెలలో విడుదల కానుంది. ఈ రెండు భాగాల హక్కులను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. ‘ధురంధర్ పార్ట్ 1′ కి నెట్‌ఫ్లిక్స్ రూ.65 కోట్లు, పార్ట్ 2’ కి రూ.65 కోట్లు చెల్లించింది. దీని కారణంగా, ‘ధురంధర్’ రణబీర్ కపూర్ ‘యానిమల్’, షారుఖ్ ఖాన్ ‘జవాన్’ సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’ రికార్డులను బద్దలు కొట్టింది.

IMDb ప్రకారం, షారుఖ్ ఖాన్ ‘జవాన్’ డిజిటల్ హక్కులు నెట్‌ఫ్లిక్స్‌కు రూ.120 కోట్లకు అమ్ముడయ్యాయి. రణ్‌బీర్ ‘యానిమల్’ కూడా అదే ధరకు అమ్ముడయ్యాయి. సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3′ OTT హక్కులు రూ.95 కోట్లకు అమ్ముడయ్యాయి. ధురంధర్ చిత్రంలో రణవీర్ సింగ్, సారా అర్జున్, రాకేష్ బేడి, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, ఆర్. మాధవన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో అర్జున్ రాంపాల్ మేజర్ ఇక్బాల్ అనే ఐఎస్ఐ ఏజెంట్ పాత్ర పోషించాడు. అలాగే ఆర్. మాధవన్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాత్రలో ఆకట్టుకున్నారు.

ధురంధర్’ సినిమా 5 రోజుల్లో  148 కోట్లు రాబట్టిందని తెలుస్తోంది.  మొదటి రోజు ఈ సినిమా 28 కోట్లు. రెండవ రోజు 32 కోట్లు. మూడవ రోజు ఆదివారం సరిగ్గా 43 కోట్లు రాబట్టింది. ఇక  నాల్గవ రోజు 23.25 కోట్లు,  ఐదవ రోజు  22.66 కోట్లు కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.