ఆయనొక లెజెండరీ ఆర్టిస్ట్‌.. ఇండస్ట్రీలో అతడిలాంటి వారు ఎవ్వరూ లేరు.. సీనియర్‌ నటుడిపై యంగ్‌ హీరో కామెంట్స్

Ranveer Singh Calls Anil Kapoor : బాలీవుడ్ యంగ్‌ హీరో రణ్‌వీర్ సింగ్ సీనియర్‌ నటుడు అనిల్‌ కపూర్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. వారిద్దరి కాంబినేషన్‌లో

ఆయనొక లెజెండరీ ఆర్టిస్ట్‌.. ఇండస్ట్రీలో అతడిలాంటి వారు ఎవ్వరూ లేరు.. సీనియర్‌ నటుడిపై యంగ్‌ హీరో కామెంట్స్
Ranveer Singh Calls Anil Ka

Updated on: Apr 01, 2021 | 9:52 PM

Ranveer Singh Calls Anil Kapoor : బాలీవుడ్ యంగ్‌ హీరో రణ్‌వీర్ సింగ్ సీనియర్‌ నటుడు అనిల్‌ కపూర్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. వారిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘దిల్ దడఖ్ నే దో’ చిత్రం ఎంత పెద్ద హిట్‌ అయిందో అందరికి తెలుసు.. అయితే ఆయనతో కలిసి పనిచేయడం చాలా అద్భుతమని అది అందరికి లభించదని అన్నాడు. అయితే వీరిద్దరు కలిసి మళ్లీ నటించడానికి సిద్దమయ్యారు. అయితే ఈసారి సినిమాలో కాదు.. ఓ బ్రాండ్ ప్రమోషన్ షూటింగ్‌ కోసం కొలాబరేట్ అయ్యారు. ‘మ్యాన్ కైండ్’ ఫార్మా కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్స్‌గా ఎన్నికైన ఈ స్టార్స్.. ఆ కంపెనీకి చెందిన కొత్త బ్రాండ్ ‘హెల్త్‌ఓకే (Health OK)’ ప్రమోషన్‌లో భాగంగా యాడ్ షూటింగ్‌లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రణ్‌వీర్ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. తాను స్క్రీన్‌పై ఎంతో గొప్పగా ఆరాధించే అనిల్ కపూర్‌తో ‘దిల్ దడఖ్ నే దో’ చిత్రం తర్వాత మళ్లీ కలిసి పని చేయడం ఆనందంగా ఉందన్నాడు. ఆయనొక లెజెండరీ ఆర్టిస్ట్‌, హిందీ సినిమా ఫెటర్నిటీలోనే ఫైనెస్ట్ యాక్టర్ అని కొనియాడారు. అంతేకాదు అనిల్ కపూర్‌కు తానెప్పుడూ కృతజ్ఞుడనై ఉంటానని పేర్కొన్నాడు. ఇక సినిమాల విషయానికొస్తే రణ్‌వీర్ ప్రస్తుతం కబీర్ ఖాన్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా ‘83’ పాటు ధర్మ ప్రొడక్షన్స్‌లో ‘సర్కస్’ మూవీలో నటిస్తున్నాడు. ఈ సందర్భంగా అనిల్ కపూర్‌తో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ గురించి రణ్‌వీర్ ఇన్‌స్టా వేదికగా పోస్ట్ పెట్టాడు.