Ranbir Kapoor: ‘యానిమల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‏లో రణబీర్ స్టైలీష్ లుక్.. సింపుల్ జాకెట్ అన్ని లక్షలా ?..

|

Nov 29, 2023 | 8:54 AM

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ మాత్రం సంగీత ప్రియులను కట్టిపడేశాయి. అలాగే ఇందులో రణబీర్ లుక్, మేనరిజం మాస్ అడియన్స్ కు తెగ నచ్చేశాయి. దీంతో ఈ చిత్రాన్ని బిగ్ స్క్రీన్ పై చూసేందుకు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే.. ఇటీవల కొద్ది రోజులుగా తెలుగు మీడియాతో ఇంట్రాక్ట్ అయ్యింది యానిమల్ చిత్రయూనిట్. వరుసగా మీడియా సమావేశాలకు, రియాల్టీ షోలకు హాజరయ్యారు. ఇక ఇటీవలే నవంబర్ 27 న హైదరాబాద్‌లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో ఈ సినిమా

Ranbir Kapoor: యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్‏లో రణబీర్ స్టైలీష్ లుక్.. సింపుల్ జాకెట్ అన్ని లక్షలా ?..
Ranbir Kapoor
Follow us on

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ప్రస్తుతం ‘యానిమల్’ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా రూపొందించిన ఈ మూవీ డిసెంబర్ 1న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతుంది. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కథానాయికగా నటించడంతో ఈ సినిమాను సౌత్ అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ మాత్రం సంగీత ప్రియులను కట్టిపడేశాయి. అలాగే ఇందులో రణబీర్ లుక్, మేనరిజం మాస్ అడియన్స్ కు తెగ నచ్చేశాయి. దీంతో ఈ చిత్రాన్ని బిగ్ స్క్రీన్ పై చూసేందుకు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే.. ఇటీవల కొద్ది రోజులుగా తెలుగు మీడియాతో ఇంట్రాక్ట్ అయ్యింది యానిమల్ చిత్రయూనిట్. వరుసగా మీడియా సమావేశాలకు, రియాల్టీ షోలకు హాజరయ్యారు. ఇక ఇటీవలే నవంబర్ 27 న హైదరాబాద్‌లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ఈ వేడుకకు సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి ముఖ్య అతిథులుగా రాగా.. వందలాది మంది విధ్యార్థులతో యూనివర్సిటీ గ్రౌండ్ కిక్కిరిసింది. ఇక ప్రీ రిలీజ్ వేదికపై రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు, లు రణబీర్ కపూర్, రష్మిక మందన్న, అనిల్ కపూర్, బాబీ డియోల్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సరదాగా సందడి చేశారు. అయితే ఈ వేడుకలో మహేష్, రణబీర్ సింపుల్ అండ్ స్టైలీష్ లుక్స్ ఆకర్షించాయి. మహేష్ సింపుల్ టీషర్ట్ తో కనిపించగా.. రణబీర్ కపూర్ తన డాషింగ్, హ్యాండ్సమ్ అప్పియరెన్స్‌తో ఈవెంట్‌లో దృష్టిని ఆకర్షించాడు. మస్టర్డ్-కలర్ ప్రాడా బ్లేజర్ ధరించి కూల్ లుక్ లో కనిపించాడు. అయితే చాలా మంది దృష్టిని ఆకర్షించింది అతని స్వెడ్ బాంబర్ జాకెట్ ధర మాత్రమే. ఇప్పుడు ఆ జాకెట్ ధర గురించి నెట్టింట వైరలవుతుంది. ఎందుకో తెలుసా.. ఆ జాకెట్ ధర రూ. 4.35 లక్షలు మరీ. మీరు విన్నది నిజమే.. సెలబ్రెటీస్ అవుట్ ఫిట్ డీకోడ్ అనే ఇన్ స్టా పేజీలో రణబీర్ జాకెట్ కు సంబంధించిన అన్ని వివరాలను ఇచ్చారు.

దీంతో ఆ జాకెట్ ధర తెలిసి షాకవుతున్నారు ఫ్యాన్స్. ఎప్పుడూ ఫ్యాషన్ ప్రపంచంలో ముందుండే రణబీర్.. కేవలం ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం రూ.4 లక్షలు విలువైన జాకెట్ ధరించడం చూసి నోరెళ్లపెడుతున్నారు. ఇదిలా ఉంటే.. తండ్రి కొడుకుల మధ్య ఉండే ఎమోషన్స్, అనుబంధాన్ని ఈ సినిమాలో చూపించారు డైరెక్టర్ సందీప్ వంగా. ఇక ఇందులో రణబీర్ తండ్రి పాత్రలో అనిల్ కపూర్ కనిపించగా.. విలన్ గా బాబీ డియోల్ నటించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.