
అపార కుబేరుడు అంబానీ ఇంట పెళ్లి వేడుక ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు గ్రాండ్ గా జరిగాయి ప్రపంచమంతా చెప్పుకునే ఈ వేడుకల్ని నిర్వహించారు అంబానీ. అంబానీ ఇంట్లో వివాహ వేడుకల హడావుడి అంటే మాములుగా ఉంటుందా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెలబ్రెటీలు ఈ వేడుకకు హాజరయ్యి సందడి చేశారు. గుజరాత్ లోని జామ్ నగర్ లో ఈ వేడుకలను నిర్వహించారు అంబానీ. జులైలో అనంత్- రాధిక వివాహం జరగనుంది.. కాగా జామ్‌నగర్‌లో మార్చి 1 నుంచి మూడు రోజుల పాటు ప్రీవెడ్డింగ్ వేడుకలను నిర్వహించారు. బాలీవుడ్ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, రామ్ చరణ్.. క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ ఈ వేడుకలకు హాజరయ్యారు. అలాగే వ్యాపార దిగ్గజాల్లో మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌పాటు అనేక మంది ఈ వేడుకకు వచ్చారు.
అంతే కాదు.. హాలీవుడ్ నుంచి పాప్ సింగర్స్ ను కూడా దింపారు అంబానీ. రాబిన్ రిహన్న ఫెంటీ ఈ వేడుకల్లో స్పెషల్ షో నిర్వహించారు. ఇందుకోసం ఈ అమ్మడికి ఏకంగా 75 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇచ్చారని తెలుస్తోంది. అలాగే ఎకాన్ కూడా ఈ వేడుకకు హాజరయ్యి సందడి చేశారు. ఇక స్టేజ్ పై అమీర్ ఖాన్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ డాన్స్ లతో అదరగొట్టారు. ఇదిలా ఉంటే తాజాగా అంబానీ ఇంట పెళ్లి వేడుక పై బాలీవుడ్ నటి రాఖీ సావంత్ షాకింగ్ కామెంట్స్ చేసింది.
ఈ మేరకు ఆమె ఓ వీడియోను విడుదల చేసింది. అంబానీ జీ నన్ను ఎందుకు పెళ్ళికి పిలవలేదు. పిలిస్తే నేను వచ్చి అన్ని పనులు చేసేదాన్ని.. ఎవరెవరినో పిలిచారు నన్ను కూడా పిలవాల్సింది. మీరు నా డాన్స్ చూడలేదు అనుకుంటా.. మీరు హాలీవుడ్ నుంచి పాప్ సింగర్స్ ను పిలిచారు కానీ వాళ్ల డాన్స్ నా ముందు దేనికి పనికి రాదు. నన్ను పిలిచి ఉంటే అదిరిపోయే డాన్స్ చేసేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది. అలాగే అనంత్ అంబానీ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. మీ కొడుకు అనంత్ చాలా లావుగా ఉన్నాడు. మీ కోడలు దానిమ్మ పండులా ఉంది. అతన్ని నా దగ్గరకు పంపండి సన్నగా చేసి పంపుతా..అలాగే అన్ని రకాలుగా తృప్తి చేసి పంపిస్తా.. దాంతో మీరు మీ కోడలు సంతోషపడతారు అంటూ డబల్ మీనింగ్ డైలాగ్స్ చెప్పింది. దాంతో నెటిజన్స్ రాఖీ సావంత్ పై మండిపడుతున్నారు..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.