Pushpa Vs KGF: ‘పుష్ప హిందీ’ వెర్షన్‌కు షాకింగ్ కలెక్షన్లు.. ఫస్ట్ డే యష్ కేజీఎఫ్‌ని బీట్ చేసిన బన్నీ..

|

Dec 19, 2021 | 12:08 PM

Pushpa Vs KGF (Hindi ): ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా సినిమాలపై దృష్టి సారించారు. ఇప్పుడు అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ కూడా పాన్ ఇండియా లెవల్లో..

Pushpa Vs KGF: పుష్ప హిందీ వెర్షన్‌కు షాకింగ్ కలెక్షన్లు.. ఫస్ట్ డే యష్ కేజీఎఫ్‌ని బీట్ చేసిన బన్నీ..
Pushpa Vs Kgf
Follow us on

Pushpa Vs KGF (Hindi ): ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా సినిమాలపై దృష్టి సారించారు. ఇప్పుడు అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ కూడా పాన్ ఇండియా లెవల్లో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాలు మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టింది. అయితే హిందీ వెర్షన్‌లో ‘పుష్ప’ , ‘కెజిఎఫ్’ చిత్రాల కలెక్షన్లను పోల్చడం మొదలు పెట్టారు. ‘రాకింగ్ స్టార్’ యష్ నటించిన ‘KGF చాప్టర్ 1′ దేశవ్యాప్తంగా 2018 విడుదలైంది. ఈ చిత్రాన్ని కన్నడ, హిందీ, మలయాళం, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేశారు. తాజాగా అల్లు అర్జున్ నటించిన పుష్ప కూడా పలు భారతీయ భాషలలో విడుదలైంది. రిలీజైన అన్ని భాషల్లోనూ పుష్ప బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుంది. అయితే  పుష్ప మూవీ తెలుగులో ఏ విధంగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు వసూలు చేస్తుందో.. అదే విధంగా హిందీ వెర్షన్ లో కూడా వసూలు చేసిన కలెక్షన్లు పలువురిని ఆశ్చర్య పరుస్తున్నాయి. అంతేకాదు ఇప్పుడు బాలీవుడ్ లో యష్ కెజిఎఫ్ ని పుష్ప కలెక్షన్లను గురించి ఆరాతీయం అందరూ ప్రారంభించారు. పూర్తి వివరాలోకి వెళ్తే..

కేజీఎఫ్  చాప్టర్ 1’ చిత్రం 2018లో రిలీజయింది. యష్ సినిమా ‘కేజీఎఫ్’ హిందీ వెర్షన్ కు తొలిరోజు  2.10 కోట్లు. ఆదాయం వెలభించింది. 8 వారాల పాటు ప్రీమియర్ షోలు ప్రదర్శించిన ఈ సినిమా హిందీ వెర్షన్ లో మొత్తం రూ.  44 కోట్లు రాబట్టింది. అయితే ఇప్పుడు కేజీఎఫ్ 1′ సినిమాతో పోలిస్తే అల్లు అర్జున్ ‘పువ్వు’ మూవీ వసూళ్లు కొంచెం ఎక్కువే. తొలిరోజు ఈ సినిమా హిందీ వెర్షన్ దాదాపు రూ.3 కోట్ల కలెక్ట్ చేసిందని సమాచారం. అయితే అసలు పుష్ప చిత్ర యూనిట్ హిందీ వెర్షన్ కు ప్రచారం పై దృష్టి పెట్టలేదు.. అయినప్పటికీ అక్కడ పుష్ప అనూహ్యంగా మంచి వసూళ్లను రాబడుతుంది.

అల్లు అర్జున్ చిత్రం , స్పైడర్ మ్యాన్,  నో వే హోమ్ సినిమా పోటీ తట్టుకుని మరీ తొలి రోజు మూడు కోట్లు రాబట్టడం  హిందీ వెర్షన్‌కి మంచి ఫీట్ అని ట్రేడ్ వర్గాలు అంటున్నారు. ఇప్పటికీ మహారాష్ట్రలో 50 శాతం థియేటర్లకు మాత్రమే అనుమతి ఉంది. ఈ నేపథ్యంలో హిందీ వెర్షన్ ‘పుష్ప’ రూ.3 కోట్లకు పైగా వసూలు చేయడం నిజంగా గ్రేట్ అని అంటున్నారు.

Also Read:  కరోనా బాధితకుటుంబాలకు అండగా ఏపీ ప్రభుత్వం..పరిహారం కోసం ఆన్‌లైన్‌ పోర్టల్‌..ఎలా అప్లై చేసుకోవాలంటే