సినిమా షూటింగ్ సెట్‏లో సేఫ్‏గా ఉన్నట్లు అనిపించలేదు.. ఆసక్తికర విషయాలను బయటపెట్టిన ప్రియాంక చోప్రా..

|

Jan 31, 2021 | 9:24 AM

ఇటీవల విడుదలైన 'వైట్ టైగర్' సినిమాతో మరో సూపర్ హిట్‏ను తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా. ఇటు బాలీవుడ్‏లోనే కాకుండా.. హాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరు

సినిమా షూటింగ్ సెట్‏లో సేఫ్‏గా ఉన్నట్లు అనిపించలేదు.. ఆసక్తికర విషయాలను బయటపెట్టిన ప్రియాంక చోప్రా..
Follow us on

ఇటీవల విడుదలైన ‘వైట్ టైగర్’ సినిమాతో మరో సూపర్ హిట్‏ను తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా. ఇటు బాలీవుడ్‏లోనే కాకుండా.. హాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుస ఆఫర్లను అందుకుంటూ… గ్లోబల్ స్టార్‏ రేసులో దూసుకుపోతుంది ఈ బ్యూటీ. తాజాగా ఓ ఇంగ్లీష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది ప్రియాంక.

తాను ఇంజినీర్ కావాలనుకున్నానని.. కానీ అనుకోకుండా అడుగులు ఎంటర్ టైన్మెంట్ వైపు పడ్డాయని తెలిపింది. 2000 అందాల పోటీలో పాల్గొన్న నేను గెలిచి కిరీటాన్ని సొంతం చేసుకున్నాను అంటూ చెప్పుకోచ్చారు. అదే సమయంలో ఇండియా నుంచి చాలా సినిమా అవకాశాలు వచ్చాయని.. కానీ అప్పటికీ ఇంకా సినిమాల గురించి తనకు పెద్దగా తెలియదని.. నటనకు సంబంధించిన విషయాలన్నింటిని షూటింగ్స్ జరుగుతుండగా నేర్చుకున్నానని చెప్పుకొచ్చింది. ఆ క్రమంలోనే సినీ ఇండస్ట్రీలో తాను ఉండిపోయానని.. తనకు ఈ పరిశ్రమ సెట్ అయిందని తెలిపింది. ఇక లాక్ డౌన్ తర్వాత షూటింగ్స్ చేయడం ఏలా అనిపించింది అని అడుగగా. లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ జరిగే చిత్రీకరణ జరిగే లొకేషన్స్‏లో జాగ్రత్తలు తీసుకున్నారు. అయినకానీ షూటింగ్ సెట్‏లో సేఫ్‏గా అనిపించలేదు అంటూ చెప్పుకొచ్చింది ప్రియాంక.

Also Read:

Radhe Shyam : ప్రేమికుల దినోత్సవం రోజున ప్రభాస్ సినిమా టీజర్..?.. ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు..