Parineeti Chopra : ఫస్ట్ కిస్, డేట్ గురించి చెబుతున్న బాలీవుడ్ ముద్దుగుమ్మ.. అదే తన తొలిముద్దని ప్రకటన..

|

Mar 01, 2021 | 5:40 AM

Parineeti Chopra : బాలీవుడ్‌ ముద్దుగుమ్మ పరిణీతి చోప్రా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ది గర్ల్‌ ఆన్‌ ది ట్రైన్‌’. రిభూ దాస్‌గుప్తా దర్శకత్వం వహించిన

Parineeti Chopra : ఫస్ట్ కిస్, డేట్ గురించి చెబుతున్న బాలీవుడ్ ముద్దుగుమ్మ.. అదే తన తొలిముద్దని ప్రకటన..
Follow us on

Parineeti Chopra : బాలీవుడ్‌ ముద్దుగుమ్మ పరిణీతి చోప్రా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ది గర్ల్‌ ఆన్‌ ది ట్రైన్‌’. రిభూ దాస్‌గుప్తా దర్శకత్వం వహించిన ఈ సినిమా తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ప్రమోషన్‌లో భాగంగా పరిణీతి చోప్రా తాజాగా ‘డూ యూ రిమెంబర్‌’ అనే ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు.

ఫస్ట్‌ కిస్‌, డేట్‌ గురించి మాట్లాడుతూ.. ‘నేను ఎప్పుడూ డేట్‌కి వెళ్లలేదు. 18 సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు ఒకర్ని ముద్దు పెట్టుకున్నాను. అదే నా తొలిముద్దు.’ అని అన్నారు. చిన్నతనంలో ఉన్నప్పుడు సైఫ్‌ అలీఖాన్‌ను తాను ఎంతగానో ప్రేమించానని పరిణీతి తెలిపారు. అంతేకాకుండా తాను కథానాయికగా నటించిన తొలి సినిమా ‘లేడీస్‌ వర్సెస్‌ రిక్కీబాల్‌’ విడుదలైన తర్వాత ఓ అభిమాని నుంచి ఓ స్పెషల్‌ గిఫ్ట్‌ తనకి అందిందని.. ఓ పుస్తకం అందులో అన్నీ లేఖలే ఉన్నాయని.. ఆమె తెలిపారు. అంతేకాకుండా ఆ గిఫ్ట్‌ తనకి ఎంతో ప్రత్యేకంగా అనిపించిందని ఆమె అన్నారు.

బాలీవుడ్ ఇండస్ట్రీలో విలక్షణ కథలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది పరిణితి చోప్రా. ప్రస్తుతం సైనా నెహ్వాల్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఆ సినిమాతో పాటు మరి కొన్ని చిత్రాలకు కూడా ఓకే చెప్పినట్లుగా సమాచారం. కాగా దర్శకుడు రిబు దాస్ గుప్తా తెరకెక్కిస్తున్న లేడీ ఓరియంటెండ్ సినిమాలో అండర్ కవర్ ఏజెంట్‏గా కనిపించనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. మార్చి నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు.

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ఎంత మంది పిల్లల్ని కనాలనుందో తెలుసా..? ఫన్నీ సమాధానమిచ్చిన గ్లోబల్‌ బ్యూటీ..