AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కండలు పెంచుతూ కష్టపడుతున్న డార్లింగ్.. ఆ సినిమా కోసం జిమ్‌‌‌‌‌‌‌‌‌లో ఫుల్ బిజీగా ప్రభాస్

వరుస పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్న ప్రభాస్‌ ఆయా సినిమాల్లో యాక్షన్‌ ఎపిసోడ్‌ల కోసం తెగ కష్ట పడుతున్నాడు.

కండలు పెంచుతూ కష్టపడుతున్న డార్లింగ్.. ఆ సినిమా కోసం జిమ్‌‌‌‌‌‌‌‌‌లో ఫుల్ బిజీగా ప్రభాస్
Rajeev Rayala
|

Updated on: Mar 01, 2021 | 12:02 PM

Share

Prabhas Workout : వరుస పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్న ప్రభాస్‌ ఆయా సినిమాల్లో యాక్షన్‌ ఎపిసోడ్‌ల కోసం తెగ కష్ట పడుతున్నాడు. జిమ్‌లో హైపవర్‌ వర్కౌవట్లతో.. క్యారెక్టర్ కు తగ్గ అప్పియరెన్స్‌లతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా కోసం భారీగా కథలు పెంచాడు డార్లింగ్ ప్రభాస్‌.. ఇప్పుడు మరో సినిమాకు ఆల్మోస్ట్‌ అదే రేంజ్‌లో కష్ట పడుతూ.. కండలు పెంచి మళ్లీ అందరినీ మెస్మరైజ్‌ చేసే పనిలో ఉన్నాడు.

అవును స్టార్‌ హీరో ప్రభాస్ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ప్రభాస్ శిక్షణ తీసుకుంటుంది సలార్ కోసం కాదు రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమా కోసం. అంతేకాకుండా ప్రభాస్ ఆదిపురుష్ సినిమా కోసం సరికొత్త భాషతో పాటుగా జిమ్‌లో తెగ కష్టం చేస్తున్నారంట. పాత్రకి సరిగ్గా సరిపోయే విధంగా శరీరాన్ని మలుచుకునేందుకు ప్రభాస్ కష్టపడుతున్నారని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా చిత్రీకరణ ముంబైలోని ఓ ప్రైవేట్ ఫిలిం స్టూడియోలో జరగనుంది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ లంకేశ్  పాత్రలో కనిపించనున్నారు. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం ప్రభాస్ ఇతర నటీనటులు కూడా ప్రస్తుతం ఈ సినిమాలో వాడనున్న భాషను నేర్చుకుంటున్నారు. అతి త్వరలో ఈ సినిమా పట్టాలెక్కనుంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతోపాటు రాధాకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న రాధేశ్యామ్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు డార్లింగ్. ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss : బిగ్‌‌‌‌‌‌బాస్ షోకు హోస్ట్ గా కొనసాగను.. తేల్చిచెప్పిన స్టార్ హీరో.. నిర్వాహకులు ఏంచేశారంటే..

‘HIT’ Movie Sequel : విశ్వక్‌‌‌‌సేన్ ‘హిట్’ కు ఏడాది.. సీక్వెల్ అనౌన్స్ చేసిన నేచురల్ స్టార్..

Follow Us
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. పోలీసుల అదుపులో నిందితుడు
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. పోలీసుల అదుపులో నిందితుడు
టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!
టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!
రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!
రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి