Tollywood: చంపేస్తామని సినీ నటికి బెదిరింపులు.. పోలీసులను ఆశ్రయించిన NCB డైరెక్టర్ సమీర్ వాంఖడే భార్య..

|

Mar 09, 2024 | 4:38 PM

పాక్, యూకే నంబర్ల నుంచి ఆమెకు అసభ్యకరమైన సందేశాలు పంపుతూ... ఆమెతోపాటు కుటుంబ సభ్యులకు ఈ బెదిరింపు కాల్స్ వచ్చినట్లు సమాచారం. గుర్తుతెలియని వ్యక్తులు తనకు కాల్ చేసి దుర్భాషలాడాడని.. చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆమె గోరేగావ్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేసింది. అలాగే నిందుతులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ పోలీసులను సహాయం కోరింది.

Tollywood: చంపేస్తామని సినీ నటికి బెదిరింపులు.. పోలీసులను ఆశ్రయించిన NCB డైరెక్టర్ సమీర్ వాంఖడే భార్య..
Kranti Redkar, Sameer Wankh
Follow us on

నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) ముంబై జోనల్ మాజీ డైరెక్టర్ సమీర్ వాంఖడే భార్య సినీ క్రాంతి రెడ్కర్‌కు చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి. పాక్, యూకే నంబర్ల నుంచి ఆమెకు అసభ్యకరమైన సందేశాలు పంపుతూ… ఆమెతోపాటు కుటుంబ సభ్యులకు ఈ బెదిరింపు కాల్స్ వచ్చినట్లు సమాచారం. గుర్తుతెలియని వ్యక్తులు తనకు కాల్ చేసి దుర్భాషలాడాడని.. చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆమె గోరేగావ్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేసింది. అలాగే నిందుతులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ పోలీసులను సహాయం కోరింది. తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో వెల్లడించింది నటి. మార్చి 6 నుంచి తనకు హత్య బెదిరింపులు వస్తున్నాయని క్రాంతి చెప్పారు.

సినీ నటి క్రాంతి రెడ్కర్ మాట్లాడుతూ.. ‘గత ఏడాది కాలంగా ఇలాంటి కాల్స్ వస్తున్నాయి. దీనిపై ఎప్పటికప్పుడు నేను పోలీసులకు ఫిర్యాదు చేస్తూనే వచ్చాను’ అని అన్నారు. అలాగే గుర్తుతెలియని కాల్స్ స్క్రీన్ షాట్స్ ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ముంబై పోలీసులను కూడా పోస్ట్‌లో ట్యాగ్ చేసింది. క్రాంతి భర్త సమీర్ వాంఖడే కు కొద్ది రోజుల క్రితం ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. ఇక ఇప్పుడు ఆయన భార్య, కుటుంబానికి కూడా చంపెస్తామని బెదిరింపులు వస్తున్నట్లు సమాచారం. క్రాంతి రెడ్కర్ ఫిర్యాదుపై డిప్యూటీ కమిషనల్ ఆఫ్ పోలీస్ ఆనంద్ స్పందిస్తూ.. ఈ ఫిర్యాదు పై విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు.

క్రాంతికి చంపేస్తామని బెదిరింపులు రావడం ఇది మొదటిసారి కాదు. గతేడాది జూన్ లో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పేరుతో ఆమెకు బెదిరింపులు వచ్చాయి. అప్పుడే తన భద్రతపై పోలీసులను ఆశ్రయించింది. ఇక ఇప్పుడు మరోసారి తనకు.. తన కుటుంబానికి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి చంపెస్తామని బెదిరింపు కాల్స్, మెసేజ్ లు వస్తున్నాయని ఫిర్యాదు చేసింది క్రాంతి.

2000లో సూన్ హవయా ఆషి సీరియల్ ద్వారా బుల్లితెరపై కెరీర్ ప్రారంభించింది క్రాంతి రెడ్కర్. ఈ సిరీయల్ అప్పట్లో మంచి విజయం సాధించింది. దీంతో క్రాంతి వెనుదిరిగి చూడలేదు. చాలా సినిమాలు, సీరియల్స్ లో నటించి మెప్పించారు. 2014లో కాకన్ అనే సినిమాకు దర్శకత్వం వహించారు క్రాంతి. అప్పట్లో ఈ మూవీకి ప్రశంసలు దక్కాయి. ఇప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఆమెకు నెట్టింట మంచి ఫాలోయింగ్ ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.