Brahmastra: బ్రహ్మస్త్ర నుంచి నాగార్జున పోస్టర్ వచ్చేసింది.. పవర్‏ఫుల్ లుక్‏లో కింగ్..

|

Jun 11, 2022 | 9:01 PM

భారీ బడ్జెట్‏తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వహిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ని శివ పేరుతో ప్రేక్షకుల

Brahmastra: బ్రహ్మస్త్ర నుంచి నాగార్జున పోస్టర్ వచ్చేసింది.. పవర్‏ఫుల్ లుక్‏లో కింగ్..
Nagarjuna
Follow us on

బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం బ్రహ్మస్త్ర (Brahmasthra). ఇందులో స్టార్ హీరో రణబీర్ కపూర్, అలియా భట్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‏తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వహిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ని శివ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. పాన్ ఇండియా స్థాయిలో 2022 సెప్టెంబర్ 9న హిందీ తెలుగు తమిళం కన్నడ మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఇందులో అమితాబ్ బచ్చన్, మౌనీ రాయ్ కీలకపాత్రలలో నటిస్తుండగా.. టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున సైతం మరో ముఖ్య పాత్రలో కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడదలైన గ్లింప్స్, సాంగ్స్, పోస్టర్స్ ఆకట్టుకోగా.. తాజాగా విడుదలైన నాగార్జున ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.

ఈ సినిమాలో అనిష్ విశిష్ట్ పాత్రలో నాగార్జున్ కనిపించనున్నట్లుగా తెలుస్తోంది. అతని గురించి తెలియజేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. “సహస్ర నందిమ్ సామర్ధ్యం.. హే నంది అస్త్రం.. ఖండ ఖండ ఖురు.. మామ్ సహాయకం, మామ్ సహాయకం” అంటూ వెయ్యి నందులతో కూడిన బలం నంది అస్త్రం.. అంటూ విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ట్రైలర్ ఈ నెల 15న విడుదల చేయనున్నారు మేకర్స్. ఈ సినిమా కోసం బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సోషియో ఫాంటసీ అడ్వెంచర్ కథతో రూపొందుతున్న ఈ సినిమాను మూడు పార్ట్‏లుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్ మరియు స్టార్‌లైట్ పిక్చర్స్ నిర్మించిన ఈ ప్రతిష్టాత్మమైన సినిమాని సెప్టెంబర్ 9న హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్‏టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.