Rakhi Sawant: బాలీవుడ్ డ్రామా క్వీన్ రాఖీ సాంత్ అరెస్ట్.. ఆ వీడియోలను షేర్ ‌చేస్తోందన్న ఫిర్యాదుతో..

|

Jan 19, 2023 | 5:32 PM

బాలీవుడ్ డ్రామా క్వీన్ రాఖీ సావంత్ కష్టాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం, ఓ నటి ఇచ్చిన ఫిర్యాదుతో అరెస్ట్ చేశారు ముంబై పోలీసులు. రాఖీ సావంత్ ఓ మహిళా మోడల్‌ను అవమానపరిచే విధంగా చేసిన వీడియో, ఫోటో కొంతకాలం క్రితం వైరల్‌గా మారింది. దీంతో..

Rakhi Sawant: బాలీవుడ్ డ్రామా క్వీన్ రాఖీ సాంత్ అరెస్ట్.. ఆ వీడియోలను షేర్ ‌చేస్తోందన్న ఫిర్యాదుతో..
Rakhi Sawant
Follow us on

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌, బాలీవుడ్‌ నటి రాఖీ సావంత్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. కొంత సమయం తరువాత పోలీసులు సావంత్‌ను అంధేరీ కోర్టులో హాజరుపరచనున్నారు. రాఖీ సావంత్ ఓ మహిళా మోడల్‌ను అవమానపరిచే విధంగా చేసిన వీడియో, ఫోటో కొంతకాలం క్రితం వైరల్‌గా మారిందని ఆరోపణలు ఉన్నాయి. అయితే, షెర్లిన్ చోప్రా ఫిర్యాదు మేరకు అంబోలి పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై రాఖీ అనుచితమైన వీడియోలు, ఫొటోలను వైరల్ చేసిందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ముంబైలోని అంబోలీ పోలీసులు రాఖీ సావంత్​ను అరెస్టు చేశారు. తదుపరి విచారణ నిమిత్తం ఆమెను పోలీస్ స్టేషన్​కు తరలించినట్లు అంబోలి పోలీసులు తెలిపారు.

ఇదిలావుంటే, నటి షెర్లిన్ చోప్రా ఇచ్చిన కంప్లెయింట్ మేరకు ఈ చర్య తీసుకున్నారు. రాఖీ సావంత్ అరెస్ట్ విషయాన్ని షెర్లిన్ చోప్రా స్వయంగా తన ట్విట్టర్ హ్యాండిల్‌లో పేర్కొన్నారు. అంబోలి పోలీసులు ఎఫ్‌ఐఆర్ 883/2022కి సంబంధించి రాఖీ సావంత్‌ను అరెస్టు చేశారు. రాఖీ సావంత్ ABA 1870/2022 ను ముంబై సెషన్స్ కోర్టు నిన్న కొట్టివేసింది.

రాఖీపై దాఖలైన కేసు గురించి కూడా షెర్లిన్ తన ట్వీట్‌లో తెలిపారు. షెర్లిన్​కు సంబంధించిన అభ్యంతరకర వీడియోలను వైరల్ చేస్తానని రాఖీ బెదిరించినట్లు సమాచారం. అయితే గురువారం మధ్యాహ్నం రాఖీ.. తన డ్యాన్స్ అకాడమీని ప్రారంభించనుంది. అంతకుముందే పోలీసులు ఆమెను అరెస్టు చేయడం గమనార్హం. కాగా, ఇటీవలే తన ప్రియుడు ఆదిల్ దురానీని ఈ మధ్యే రాఖీ పెళ్లాడిన సంగతి తెలిసిందే.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ న్యూస్ కోసం