బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నటించిన జవాన్ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతోంది. శుక్రవారం (సెప్టెంబర్ 7)న విడుదలైన పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూడు రోజుల్లోనే రూ.350 కోట్లు వసూలు సాధించింది. ప్రస్తుతం జవాన్ జోరు చూస్తుంటే వీకెండ్ ముగిసేలోపే రూ.500 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశముందంటున్నారు ట్రేడ్ నిపుణులు. అలాగే ఈజీగా రూ.1000 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసిందని అభిమానులు సంబరపడుతున్నారు. అట్లీ తెరకెక్కించిన జవాన్ సినిమాలో తండ్రీ కొడుకులుగా డబుల్ రోల్‌లో మెప్పించాడు షారుక్ ఖాన్ . అయితే చాలా సీన్స్‌లో, ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లో షారుక్‌కు బదులు అతని డూప్ యాక్ట్ చేశాడట. ‘జవాన్’ సినిమానే కాదు.. గత 15 ఏళ్ల నుంచి బాలీవుడ్ బాద్‌షాకు డూప్ గా నటిస్తున్న వ్యక్తి పేరు ప్రశాంత్ వాల్దె. ఇతను షారుక్‌కి డూప్‌గా నటిస్తున్నప్పటికీ డైరెక్టర్‌గా, రైటర్‌గా, నిర్మాతగా బిజీగా ఉంటున్నాడు. ఇక ప్రశాంత్ రెమ్యూనరేషన్ వివరాలు తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే. 2007 నుంచి షారుక్‌కు డూప్‍గా నటిస్తున్న ప్రశాంత్ రోజుకు రూ. 30వేల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటాడట. అంటే నెలకు సుమారు రూ. 9లక్షలు అన్నమాట. ఇక లేటెస్ట్ జవాన్ సినిమా కోసం ఏకంగా రూ.30 లక్షల నుంచి 40 లక్షల వరకు పారితోషకం అందుకున్నాడట ప్రశాంత్.
కాగా షారుక్‌కు డూప్‌గా నటించడం, అలాగే జవాన్ సినిమా అనుభవాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు ప్రశాంత్. ‘ జవాన్ మూవీలో తండ్రిని కుమారుడు ఆత్మీయంగా హత్తుకునే సన్నివేశం ఉంది. అందులో షారుక్ కుమారుడు గెటప్ వేస్తే.. నేను తండ్రి రోల్ చేశాను. నన్ను కౌగిలించుకునే సమయంలో ఆయన క్లోజప్ షాట్స్ తీశారు. అలాగే మరొక సన్నివేశంలో నేను కొడుకు గెటప్ వేస్తే.. షారుక్ తండ్రి ఓల్డ్ గెటప్ వేశారు. అప్పుడు తండ్రి క్లోజప్ షాట్స్ తీశారు. ఇలా మేమిద్దరం ఒకే రోజు రెండు వేర్వేరు గెటప్స్, లుక్స్ మార్చాల్సి వచ్చింది’ అని ప్రశాంత్ వాల్దే తెలిపాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.