Juhi Chawla: బాలీవుడ్ నటి జూహీ చావ్లా.. దేశంలో 5జీ నెట్ వర్క్ ట్రయల్స్ చేయవద్దంటూ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై బుధవారం ఢిల్లీ హైకోర్టు వర్చువల్ విచారణ ప్రారంభించింది. ఈ విచారణకు నటి జూహీ చావ్లా కూడా హాజరయ్యింది. కోర్టులో జూహీని చూసిన ఓ వ్యక్తి ఆమె సినిమాల్లోని పలు పాటలు పాడడం ప్రారంభించాడు. ముందుగా 1993లో జుహీ నటించిన సినిమా హమ్ హై రాహీ ప్యార్ కే మూవీలోని ఘూంగట్ కి ఆద్ సే పాటను పాడాడు. ఆ తర్వాత అతను మీటింగ్ నుంచి వెళ్ళిపోయి మళ్లీ వచ్చాడు. ఈసారి 1995లో జూహీ నటించిన నాజయాజ్ సినిమాలోని లాల్ లాల్ హోటోంపే పాట పాడాడు. తర్వాత మీటింగ్‌లో నుంచి వెళ్లిపోయి మళ్లీ వచ్చాడు. ఇక ఈసారి మేరీ బన్నో కీ ఆయేగీ బారాత్ అంటూ మరో పాట ఆలపించాడు..
ఈ తతంగం మొత్తం చూసిన జడ్జికి విపరీతమైన కోపం ముంచుకొచ్చింది. దీంతో ఆ వ్యక్తిని మీటింగ్ నుంచి తొలగించాలని ఆదేశించారు. అంతేకాదు.. ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్న హైకోర్టు.. ఆ వ్యక్తిని పట్టుకోవాలని పోలీసులను ఆదేశించింది. అలాగే అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. ఇటీవల 5జీ నెట్‌వర్క్ పర్యావరణం, మనుషులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందంటూ.. ఆ నెట్‌వర్క్ ట్రయల్స్ ఆపాలని జూహీ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. 5జీ నెట్ వర్క్ నుంచి విడుదలయ్యే రేడియేషన్ వలన ప్రజలకు, పక్షులకు, జంతువులకు ప్రాణహాని జరుగుతుందని.. వారికి నష్టపరిహారం చెల్లించే బాధ్యత టెలికాం సంస్థలదే అని ఢిల్లీ హైకోర్టుకు 500 పేజీలతో కూడిన ఫిర్యాదును అందజేసింది జూహీ.
ఎక్స్‌పైరీ డేట్ ముగిసిన మెడిసిన్‌లు విషంగా మారతాయి.? వాటిని పొరపాటున వేసుకుంటే ఏమవుతుంది.!