
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయోగరాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది మోనాలిసా భోంస్లే. అక్కడ పూసల దండలు, రుద్రాక్షలు అమ్ముకోవడానికి వచ్చి తన అందం, అమాయకత్వంతో అందరి దృష్టిని ఆకర్షించింది. అందమైన చిరునవ్వు, ఆకట్టుకునే రూపం, తేనె కళ్లతో మోనాలిసా సోషల్ మీడియా సెన్సేషనల్ గా మారిపోయింది. ఆమె ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా ఓ రేంజ్‌లో వైరలయ్యాయి. ఇప్పుడు అదే క్రేజ్ తో ఒక బాలీవుడ్ సినిమాలోనూ అవకాశం సంపాదించుకుంది. బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా తెరకెక్కిస్తోన్న ‘ది డైరీస్ ఆఫ్ మణిపూర్’ లో మోనాలిసా ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఇందుకోసం ఆమెను అన్ని రకాలుగా ప్రిపేర్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే మోనాలిసా రేంజ్, క్రేజ్ పూర్తిగా మారిపోయింది. తాజాగా ఆమె ఓ బ్రాండ్ ఈవెంట్ కోసం కేరళ వెళ్లింది. డైరెక్టర్ సనోజ్ మిశ్రాతో కలిసి ఓ స్పెషల్ ఫ్లైట్ లో కేరళకు ప్రయాణించింది. ఈ సందర్భంగా సనోజ్ మిశ్రా స్వయంగా ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్లగా ఎస్కలేటర్‌పై వెళ్లడంలో మోనాలిసా కాస్త ఇబ్బంది పడిగా డైరెక్టర్ సాయం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది.
కాగా ఇటీవల నటి హనీరోజ్ ను వేధించిన కేసులో ప్రముఖ వ్యాపారవేత్త బాబీ చెమ్మనూరు అరెస్టైన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం అతను బెయిల్ పై బయట ఉన్నాడు. ఇప్పుడు అతను కేరళలో మరో బంగారు ఆభరణాల దుకాణాన్ని ప్రారంభించాడు. ఇప్పుడిదే ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా హాజరైంది మోనాలిసా.
ఈ సందర్భంగా ఆమెను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇదే ఇవెంట్ లో రెడ్ కలర్ డ్రెస్, ఒంటినిండా ఆభరణాలతో ఎంతో అందంగా కనిపించింది మోనాలిసా. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగావైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు మోనాలిసా రేంజ్ మారిపోయిందంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.