
బాలీవుడ్ లెజండరీ నటుడు ధర్మేంద్ర తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం సోమవారం (24న) మరింత క్షీణించడంతో కన్నుమూశారు. సినీప్రముఖులు ఆయనకు నివాళులర్పిస్తున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని సోషల్ మీడియా వేదికగా గుర్తుచేసుకుంటున్నారు. ధర్మేంద్రకు అభిమానులు ప్రేమగా ఇచ్చిన పేరు హీ-మ్యాన్. ఈ పేరు వెనుకున్న కారణం.. అసలు ఆయనకు ఆ పేరు ఎలా వచ్చిందనే విషయాలు తెలుసుకుందాం. 1960ల, 70లలో బాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ యాక్షన్ హీరోగా మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పట్లో కండలు తిరిగిన శరీరం, పంజాబీ మూలాలున్న ఆయన రగ్గడ్ లుక్స్ అప్పట్లో ఆయనకు ప్రత్యేకంగా నిలిచాడు. దీంతో ఆయనను అభిమానులు హీ-మ్యాన్ అని పిలుచుకునేవారు. ఇండస్ట్రీలో యాక్షన్ హీరోగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి : Actress : తెలుగులో తోపు హీరోయిన్.. ఇప్పుడు బడా నిర్మాత.. పవన్ కళ్యాణ్, మహేష్ బాబుతో బ్లాక్ బస్టర్ హిట్స్..
అప్పట్లో ఆయన ఎక్కువగా యాక్షన్ చిత్రాల్లోనే నటించేవారు. షోలే, ధరమ్ వీర్, మేరా గావ్ మేరా దేశ్ వంటి చిత్రాల్లో నటించిన ఆయన.. శక్తిమంతుడైన హీరోగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. దాంతో ఆయనకు అభిమానులు హీ మ్యాన్ అనే పేరు పెట్టుకున్నారు. ఎప్పుడూ హీరోయిజం సినిమాలు కాకుండా విభిన్న జానర్ చిత్రాలను సైతం ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకులను అలరించారు. దాదాపు 300లకు పైగా చిత్రాల్లో నటించి తనదైన ముద్రవేశారు. ధర్మేంద్ర వయసు 89 సంవత్సరాలు. ఇప్పటికీ ఎంతో ఫిట్ గా, ఆరోగ్యంగానే కనిపించారు. ఈ వయసులోనూ తనను తాను ఫిట్‌గా ఉంచుకున్నాడు. ధర్మేంద్ర కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవాడు.
ఇవి కూడా చదవండి : Cinema : రూ.32 కోట్లు పెట్టి తీస్తే రూ.440 కోట్ల కలెక్షన్స్.. ఆరేళ్లుగా సంచలనం.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..
చాలా తన ఫిట్నెస్, ఆరోగ్య విషయాలను నెట్టింట పంచుకున్నారు. 89 ఏళ్ల వయసులోనూ నిత్యం జిమ్ వర్కవుట్స్ చేసేవారు. అలాగే రోజూ స్విమ్మింగ్ చేసేవారు. ఇలా చేయడమనేది ఆయన కాళ్లకు వ్యాయామం. ఈత కొట్టడం వల్ల కండరాలు, ఎముకలు బలపడతాయి. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మానసిక స్థితి మెరుగుపడుతుంది. ధర్మేంద్ర ఫిజియోథెరపీ చేయించుకునేవాడు. అందుకే ఈ వయసులోనూ ఎంతో ఫిట్ గా కనిపించారు ధర్మేంద్ర.
ఇవి కూడా చదవండి : Cinema : రూ.32 కోట్లు పెట్టి తీస్తే రూ.440 కోట్ల కలెక్షన్స్.. ఆరేళ్లుగా సంచలనం.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..