Katrina Kaif Birthday : బాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి కత్రినా కైఫ్. ఈ రోజు ఆమె 38 వ పుట్టినరోజు జరుపుకుంటోంది. కత్రినా 16 జూలై 1983 న హాంకాంగ్‌లో జన్మించింది. ‘బూమ్’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయింది. తరువాత సల్మాన్ ఖాన్ సరసన మైనే ప్యార్ క్యున్ కియాలో కనిపించింది. అప్పటి నుంచి ఆమె బాలీవుడ్‌లో విజయపరంపర కొనసాగిస్తోంది. ఇండస్ట్రీకి వచ్చిన తక్కువ రోజులలోనే టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. సల్మాన్ నుంచి మొదలు కొని అక్షయ్ వరకు అందరితో జోడి కట్టింది. ప్రస్తుతం విక్కీ కౌషల్‌తో సినిమా చేస్తుంది. కత్రినా పుట్టినరోజున సందర్భంగా ఆమె హిట్ జతల గురించి ఓ లుక్కేద్దాం.
1. సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్
సల్మాన్ ఖాన్‌తో కలిసి పనిచేయడం వల్ల కత్రినా కైఫ్ బాలీవుడ్‌లో గుర్తింపు సాధించింది. ఇద్దరూ చాలా సినిమాల్లో కలిసి పనిచేశారు. అందులో ఒకటి టైగర్, పార్టనర్, యువరాజ్. త్వరలో ఈ ఇద్దరు టైగర్ జిందా హై 3 లో కనిపించనున్నారు.
2. అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్
అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్ కలిసి చాలా సూపర్‌హిట్ చిత్రాల్లో నటించారు. ఇద్దరి కెమిస్ట్రీ ప్రతిసారీ అభిమానుల హృదయాలను దోచుకుంది. అక్షయ్, కత్రినా కలిసి డి, డానా డాన్, నమస్తే లండన్, హమ్కో దీవానా కర్ గే, సింగ్ ఈజ్ కింగ్ వంటి అనేక చిత్రాల్లో కలిసి పనిచేశారు. త్వరలో ఇద్దరూ కలిసి సూర్యవంశీ చిత్రంలో కనిపించనున్నారు.
3. షారుఖ్ ఖాన్, కత్రినా కైఫ్
కత్రినా కైఫ్ కింగ్ ఆఫ్ రొమాన్స్ షారుఖ్ ఖాన్‌తో కలిసి రెండు చిత్రాల్లో పనిచేశారు. మొదటిసారి ఇద్దరూ కలిసి జబ్ తక్ హై జాన్ లో కలిసి పనిచేశారు. ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. తరువాత ఇద్దరూ జీరోలో కలిసి కనిపించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బాగా రాణించలేదు కానీ కత్రినా నటన బాగా నచ్చింది.
4. రణబీర్ కపూర్, కత్రినా కైఫ్
రణబీర్ కపూర్, కత్రినా కైఫ్ ల కెమిస్ట్రీ చాలా నచ్చింది. ఇద్దరూ కలిసి రెండు సినిమాల్లో పనిచేశారు. ఇందులో అజాబ్ ప్రేమ్ కి గజాబ్ కహానీ, జగ్గా జాసూస్ ఉన్నారు. రెండింటిలో ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ బాగా నచ్చింది.
5. విక్కీ కౌషల్, కత్రినా కైఫ్
విక్కీ కౌషల్, కత్రినా కైఫ్ ఇద్దరి మధ్య ఏదో సంబంధం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇద్దరూ తరచూ కలిసి కనిపిస్తారు కానీ ఎప్పుడూ ఒకరికొకరు మంచి స్నేహితులు అని చెప్తారు. కరీనా జోహార్ చాట్ షోలో విక్కీ కౌషల్‌తో కలిసి పనిచేయాలనుకుంటున్నట్లు కత్రినా తెలిపింది.