Salim Akhtar: బాలీవుడ్‌లో తీవ్ర విషాదం..ప్రముఖ నిర్మాత సలీం అక్తర్ కన్నుమూత

బాలీవుడ్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత సలీమ్ అక్తర్ (82) కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అక్తర్ ముంబైలోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అక్తర్ మృతిపై బాలీవుడ్‌ ప్రములు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విషయం తెలిసిన పలువురు ఆయన మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు.

Salim Akhtar: బాలీవుడ్‌లో తీవ్ర విషాదం..ప్రముఖ నిర్మాత సలీం అక్తర్ కన్నుమూత
Salim Akhtar

Updated on: Apr 09, 2025 | 5:15 PM

సలీమ్ అక్తర్ నిర్మాతగా ఎంతో పేరొందిన వ్యక్తి. ఆమీర్ ఖాన్, బాబీ డియోల్ వంటి హీరోలతో వరస సినిమాలు నిర్మించి..బాలీవుడ్ లో మంచి నిర్మాతగా ఈయన గుర్తింపు తెచ్చుకున్నారు.’రాజా కీ ఆయేగా బరాత్’ సినిమాతో 1997లో రాణీ ముఖర్జీని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఆ తర్వాత మిల్క్‌ బ్యూటీ అయిన తమన్నాను ‘చాంద్ సా రోషన్ చెహ్రా’ మూవీతో 2005లో హిందీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అలా పలువురు హీరోయిన్లకు ఇండస్ట్రీకి పరిచయం చేసిన వ్యక్తిగా సలీం అక్తర్ నిలిచారు. కాగా ఇవాళ మధ్యాహ్నం సలీమ్ అక్తర్ అంత్యక్రియలు జరగనున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..