హృతిక్ రోషన్ , దీపికా పదుకొణె జంటగా నటించిన ‘ఫైటర్’. గణతంత్ర దినోత్సవం కానుకగా జనవరి 25న విడుదలైన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ మంచి వసూళ్లను సాధిస్తోంది. బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళుతోంది. అదే సమయంలో ఫైటర్ సినిమాను వివాదాలు చుట్టుముడుతున్నాయి. గల్ఫ్ దేశాల్లో ఈ సినిమాపై నిషేధం విధించారు. వీటన్నింటి మధ్య ఈ సినిమా ఇప్పుడు న్యాయపరమైన చిక్కుల్లో పడింది. హృతిక్, దీపికల సినిమాపై ఎయిర్ ఫోర్స్ అధికారి ఒకరు తీవ్ర అభ్యంతరం చేశారు. ఎయిర్ ఫోర్స్ సాహసాల నేపథ్యంలో ఫైటర్ మూవీ రూపొందింది. అయితే కమర్షియల్ టచ్ ఇచ్చేందుకు సినిమాలో రొమాంటిక్ సీన్లు, బికినీ డ్యాన్స్‌లు, నటీనటుల మధ్య ముద్దులు జోడించారు. ఇవే సన్నివేశాలు ఇప్పుడు సినిమాని ఇరకాటంలో పడేశాయి. ‘ఫైటర్’ సినిమాలో హీరో హృతిక్ రోషన్, హీరోయిన్ దీపికా పదుకొణె మధ్య కొన్ని హాట్ సీన్స్ ఉన్నాయి. బీచ్‌లో చిత్రీకరించిన ఓ పాట కూడా హాట్ హాట్‌గా ఉంది. హృతిక్, దీపిక మధ్య కొన్ని ముద్దు సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఒక సన్నివేశంలో, హృతిక్ మరియు దీపికా పదుకొణె ఎయిర్ ఫోర్స్ యూనిఫాం ధరించి ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటారు. ఈ సన్నివేశంపై ఎయిర్ ఫోర్స్ అధికారి అభ్యంతరం వ్యక్తం చేస్తూ సినిమాపై కేసు వేశాడు.
‘ఫైటర్’ సినిమాలో హృతిక్, దీపికా ఎయిర్ ఫోర్స్ యూనిఫాం ధరించి ముద్దులు పెట్టుకునే సన్నివేశం వైమానిక దళానికి విరుద్ధమని అసోం ఎయిర్ ఫోర్స్ అధికారి సౌమ్య దీప్ దాస్ మండిపడ్డాడు. వైమానిక దళం అనుసరించే నియమాలు, యూనిఫాంకు ఇది అవమానమంటూ ఫైటర్ చిత్ర బృందానికి లీగల్ నోటీసులు పంపాడు. ‘ఫైటర్’ సినిమా లో హృతిక్ రోషన్, దీపికా పదుకొణెలతో పాటు అనిల్ కపూర్, కరణ్ సింగ్ గ్రోవర్, అక్షయ్ ఒబెరాయ్ తదితరులు నటించారు. ఇది భారతదేశంలోనే తొలి ఎయిర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అని చిత్ర బృందం ప్రచారం చేసింది. ట్రైలర్‌లో చూపించిన యాక్షన్ సన్నివేశాలు కూడా బాగున్నాయి. అయితే సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. దీని గురించి దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ మాట్లాడుతూ.. ‘భారతదేశంలో చాలా మందికి ఫైటర్ జెట్‌లు, వాటి వేగం, వాటి సాంకేతికత, వాటి ప్రాముఖ్యత గురించి తెలియదు కాబట్టి మా సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
The Indian Air Force band’s powerfully rousing rendition of the #SpiritOfFighter theme echoes in the skies and makes our hearts soar. Truly an honour!#VandeMataram #Fighter@IAF_MCC pic.twitter.com/J3Hc1hAOp0
— Hrithik Roshan (@iHrithik) January 24, 2024
Nothing happens unless first we dream. We dreamt, we toiled, we persevered, and finally we brought our vision to life. Take a peek behind the lens.#FighterOn25thJan in cinemas.#Fighter Forever 🇮🇳 pic.twitter.com/prpoyYVT5j
— Hrithik Roshan (@iHrithik) January 23, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.