Hollywood Actor Dustin Diamond dies: ప్రముఖ హాలీవుడ్‌ నటుడు మృతి.. సీరియల్‌ ద్వారా బాల నటుడిగా గుర్తింపు

|

Feb 02, 2021 | 1:12 PM

Hollywood Actor Dustin Diamond dies: ప్రముఖ హాలీవుడ్‌ టీవీ నటుడు డస్టిన్‌ డైమండ్‌ (44) మృతి చెందాడు. గత కొద్ది రోజులుగా కణ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన...

Hollywood Actor Dustin Diamond dies: ప్రముఖ హాలీవుడ్‌ నటుడు మృతి.. సీరియల్‌ ద్వారా బాల నటుడిగా గుర్తింపు
Follow us on

Hollywood Actor Dustin Diamond dies: ప్రముఖ హాలీవుడ్‌ టీవీ నటుడు డస్టిన్‌ డైమండ్‌ (44) మృతి చెందాడు. గత కొద్ది రోజులుగా కణ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఫ్లోరిడాలోని ఆస్పత్రిలో కన్నుమూశాడు. సెవ్డ్‌ బైది బెల్‌ సీరియల్‌తో బాల నటుడుగా గుర్తింపు తెచ్చుకున్న డస్టిన్‌ డైమండ్‌.. కొంత కాలంగా కణ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు ఆయన తండ్రి మార్క్‌ డైమండ్‌ తెలిపాడుఎ. స్టేజ్‌ 4 కణ క్యాన్సర్‌కు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న అతను నిన్న మరణించినట్లు ఆయన తండ్రి పేర్కొన్నారు.

కాగా, 1989 నుంచి 1992 మధ్య కాలంలో వచ్చిన ‘సెవ్డ్‌ బై ది బెల్‌’ సీరియల్‌లో డస్టిన్‌ బాల నటుడుగా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇందులో డస్టిన్‌ తన ప్రతిభతో అందరి మన్ననలు పొందాడు. అప్పట్లో ప్రముఖ ఛానల్‌ ఎన్‌బీసీలో ప్రతి శనివారం ఉదయం ప్రసారమయ్యే ఈ సీరియల్‌ అత్యంత ప్రేక్షక ఆదరణ పొందింది.

Also Read: Adipurush Movie: ఆదిపురుష్ ఆరంభ్.. బాహుబలి ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే..