సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రతి చిన్న న్యూస్ తెగ చక్కర్లు కొడుతుంది. ముఖ్యంగా సెలబ్రెటీలకు సంబంధించిన ఏ విషయమైన క్షణాల్లో వైరలవుతుంది. ఈ క్రమంలోనే ఇటీవల కొద్దిరోజులుగా స్టార్ హీరోహీరోయిన్స్ చిన్ననాటి ఫోటోస్ ట్రెండ్ అవుతున్నాయి. తమ అభిమాన నటీనటులు బాల్యంలో ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి నెటిజన్స్ కూడా ఆసక్తి చూపిస్తున్నారు. పైన ఫోటోను చూశారు కదా.. అందులో అమాయకపు చూపులతో కట్టిపడేస్తోన్న ఆ క్యూటీని గుర్తుపట్టండి. తను ఓ స్టార్ హీరో కూతురు.. ఇప్పుడు ఇండస్ట్రీలోని అగ్ర హీరోయిన్లలో ఒకరు. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోంది. ముఖఅయంగా ఫిట్ నెస్, స్కిన్ కేర్ విషయాల్లో తన అభిమానులకు చిట్కాలు కూడా అందిస్తుంటుంది. గుర్తుపట్టారా ?.. తనే బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్.
బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురే సారా. ప్రస్తుతం ఇండస్ట్రీలో చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. సినిమాల్లోకి రాకముందు సారా చాలా బొద్దుగా ఉండేది. అప్పట్లో ఆమెపై విమర్శలు, ట్రోల్స్ వచ్చాయి. దీన్ని సవాల్ గా తీసుకున్న సారా.. ఆ తర్వాత వర్కవుట్స్ చేసి ఇప్పుడు సన్నజాజి తీగలా మారింది. కేదార్ నాథ్ సినిమాతో తెరంగేట్రం చేసిన సారా.. మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకుంది. ఇందులో దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా నటించారు.
ఆ తర్వాత రణ్వీర్ సింగ్ సరసన సింబా మూవీలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని అందుకుంది. దీంతో సారాకు ఆఫర్స్ క్యూ కట్టాయి. కేవలం నార్త్ లోనే కాకుండా.. కోలీవుడ్ స్టార్ ధనుష్ నటించిన ఆత్రంగి రే సినిమాతో ఇటు సౌత్ లోనూ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సారా.. తాజాగా తన చిన్ననాటి ఫోటోను షేర్ చేసింది. చిన్నప్పుడు చేతులపై కూర్చున్న ఫోటోకు.. ఇప్పుడు తాను వర్కవుట్ చేస్తోన్న వీడియోను జత చేసింది. చిన్నప్పటి నుంచి చేతులు బలంగా ఉన్నాయి అంటూ క్యాప్షన్ ఇవ్వగా.. ప్రస్తుతం సారా చైల్డ్ హుడ్ పిక్ వైరలవుతుంది. ఈ ఫోటోలో సారా ఎంతో క్యూట్ గా ముద్దుగా కనిపిస్తోందంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇటీవల ‘జరా హత్కే జరా బచ్కే’ సినిమాతో మరో హిట్ అందుకుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.