Shah Rukh Khan: షారుఖ్ వాచ్ అమ్మితే లైఫ్ సెటిల్.. ఎన్ని కోట్లుంటుందో తెలుసా ?..

|

Sep 17, 2023 | 8:52 PM

పాన్ ఇండియా స్థాయిలో బాద్ షా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు భారతదేశంలోని అత్యంత సంపన్నులలో ఒకరిగా గుర్తింపు సంపాదించుకున్నారు. దాదాపు రూ.6000 కోట్ల ఆస్తి కలిగి ఉన్నారు షారుఖ్. ఇటీవల జవాన్ సక్సెస్ సెలబ్రెషన్స్ లో షారుఖ్ లుక్ అందరిని ఆకట్టుకుంది.

Shah Rukh Khan: షారుఖ్ వాచ్ అమ్మితే లైఫ్ సెటిల్.. ఎన్ని కోట్లుంటుందో తెలుసా ?..
Shah Rukh Khan
Follow us on

ప్రస్తుతం జవాన్ చిత్రంతో అద్భుతమైన విజయం అందుకున్నాడు హీరో షారుఖ్ ఖాన్. విడుదలైన మొదటి రోజే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ సినిమా.. ఇప్పటివరకు దాదాపు రూ.700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాతో మరోసారి కింగ్ సత్తా చాటారు. షారుఖ్.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ డమ్ అందుకున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో బాద్ షా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు భారతదేశంలోని అత్యంత సంపన్నులలో ఒకరిగా గుర్తింపు సంపాదించుకున్నారు. దాదాపు రూ.6000 కోట్ల ఆస్తి కలిగి ఉన్నారు షారుఖ్. ఇటీవల జవాన్ సక్సెస్ సెలబ్రెషన్స్ లో షారుఖ్ లుక్ అందరిని ఆకట్టుకుంది. బ్లాక్ సూట్ లో మరింత స్టైలీష్ లుక్ లో కనిపించారు షారుఖ్. చాలా కాలం తర్వాత బాద్ షా ఖాతాలో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ చేరాయి. పఠాన్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన షారుఖ్.. ఇప్పుడు జవాన్ సినిమాతో మరోసారి సత్తా చాటారు.

శుక్రవారం ముంబయిలో ‘జవాన్‌’ విజయోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన ప్రెస్‌మీట్‌లో కింగ్‌ఖాన్‌ స్టైల్‌ అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా షారుఖ్ ధరించిన పటేక్ ఫిలిప్ వాచ్ స్పెషల్ గా నిలిచింది. ఆ వాచ్ ధర రూ.1.22 కోట్లు అని తెలుస్తోంది. ఇక ఆ వాచ్ ధర తెలిసి అవాక్కవుతున్నారు నెటిజన్స్.

షారుఖ్ వాచ్ కలెక్షన్స్..

  • పటేక్ ఫిలిప్ నాటిలస్ 5711/1A
  • పటేక్ ఫిలిప్ ఆక్వానాట్ 5968A
  • రోలెక్స్ కాస్మోగ్రాఫ్ డేటోనా
  • హ్యూయర్ కారెరా కాలిబర్ 1887 స్పేస్‌ఎక్స్‌
  • హ్యూయర్ మొనాకో సిక్స్టీ నైన్‌
  • Audemars Piguet రాయల్ ఓక్

ఇక షారుఖ్ డిసెంబర్ లో రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో వస్తోన్న డుంకీ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే సల్మాన్ ఖాన్ నటిస్తో్న్న టైగర్ 3 చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నారు. దేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరైన షారుఖ్ ఖాన్, 1988లో ఫౌజీ అనే టీవీ షోతో తన నటనా జీవితాన్ని ప్రారంభించాడు. 1992లో దివ్య భారతి, రిషి కపూర్‌లతో కలిసి నటించిన దీవానాతో తన సినీ జీవితాన్ని ప్రారంభించాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.