బాలీవుడ్ అడియన్స్ చిరకాల కోరిక ఎట్టకేలకు నేరవేరింది. అంబానీ ప్రీవెడ్డింగ్ సెలబ్రెషన్స్లో ఒకే స్టేజ్ పై కలిసి కనిపించారు ఖాన్ త్రయం. కాసేపు సరదాగా ముచ్చటించడం కాకుండా ప్రపంచాన్ని ఊపేసిన నాటు నాటు పాటకు కాలు కదిపారు. చాలా కాలం తర్వాత షారుఖ్, సల్మాన్, అమీర్ ముగ్గురు కలిసి డాన్స్ చేయడం చూసి అభిమానులు ఫుల్ ఖుషి అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మురిసిపోతున్నారు. ఇక ఇదే వేదికపై ఖాన్ త్రయంతో కలిసి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం డాన్స్ చేసిన సంగతి తెలిసిందే. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రెషన్స్ ముగిశాయి. కానీ ఇప్పటికీ అంబానీ ముందస్తు పెళ్లి వేడుకల హాడావిడి మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఇప్పుడు నెట్టింట ఓ టాపిక్ చర్చనీయాంశమవుతుంది. అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రెషన్లలో డాన్స్ చేసేందుకు ఈ ముగ్గురు స్టార్స్ భారీ మొత్తంలో పారితోషికం తీసుకున్నట్లు ప్రచారం జరిగింది.
అయితే షారుఖ్, సల్మాన్, అమీర్ ముగ్గురు కలిసి వేదికపై డాన్స్ చేయాలనే నిర్ణయం అంబానీ తీసుకున్నారట. కానీ ఇందుకు ముగ్గురు ఎలాంటి పారితోషికం తీసుకోలేదట. అలాగే ముగ్గురితో కలిసి డాన్స్ చేసినందుకు చరణ్ కూడా డబ్బులు తీసుకోలేదట. అంబానీ కార్యక్రమానికి బాలీవుడ్ నటీనటులు గౌరవ వేతనాన్ని తీసుకోలేదు.. కానీ అంతర్జాతీయ సెలబ్రిటీలు భారీ మొత్తంలో డబ్బు తీసుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాత పాప్ సింగర్ రిహన్నా అంబానీ ఈవెంట్‌లో ప్రదర్శన ఇవ్వడానికి 75 కోట్ల రూపాయలు తీసుకున్న సంగతి తెలిసిందే.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రెషన్స్ గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో చాలా గ్రాండ్‌గా జరిగాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి దేశ, విదేశాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. మెటా సీఈవో జుకర్ బర్గ్, బిల్ గేట్స్, ట్రంప్ ఇవాంక.. అత్యంత సంపన్నులు హజరయ్యారు.
FIRE ON THE FLOOR – Shah Rukh Khan, Salman Khan and Aamir Khan dance to Naatu Naatu at the pre-wedding celebration of Anant Ambani 🔥🔥 #ShahRukhKhan #SalmanKhan #AamirKhan #AnantAmbani #AnantRadhika #Ambani #AmbaniWedding pic.twitter.com/tvaRZP0Jt3
— Shah Rukh Khan Universe Fan Club (@SRKUniverse) March 2, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.