Deepika-Ranveer: దీపికా, రణవీర్ సంవత్సరానికి ఎంత సంపాదిస్తారో తెలుసా ?.. ఒక్కో సినిమా రెమ్యునరేషన్ తెలిస్తే మైండ్ బ్లాంకే..

ఈ ఏడాది సెప్టెంబర్‏లో తమ బిడ్డ ఈ ప్రపంచంలోకి రాబోతుందని తెలిపారు. దీంతో వీరిద్దరికి సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే ఇప్పుడు వీరిద్దరికి సంబంధించిన విషయాలే సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ప్రస్తుతం వీరిద్దరు బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోహీరోయిన్స్. ఇద్దరు కలిసి రామ్ లీలా సినిమాలో నటించారు. ఈ మూవీ షూటింగ్ సమయంలో ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది.

Deepika-Ranveer: దీపికా, రణవీర్ సంవత్సరానికి ఎంత సంపాదిస్తారో తెలుసా ?.. ఒక్కో సినిమా రెమ్యునరేషన్ తెలిస్తే మైండ్ బ్లాంకే..
Deepika Padukone, Ranveer

Updated on: Mar 02, 2024 | 9:38 AM

బాలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్ దీపికా పదుకొణే, రణవీర్ సింగ్ పేరెంట్స్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు. ఈ ఏడాది తమ మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నట్లు ఆనంందగా ప్రకటించారు. ఈ ఏడాది సెప్టెంబర్‏లో తమ బిడ్డ ఈ ప్రపంచంలోకి రాబోతుందని తెలిపారు. దీంతో వీరిద్దరికి సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే ఇప్పుడు వీరిద్దరికి సంబంధించిన విషయాలే సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ప్రస్తుతం వీరిద్దరు బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోహీరోయిన్స్. ఇద్దరు కలిసి రామ్ లీలా సినిమాలో నటించారు. ఈ మూవీ షూటింగ్ సమయంలో ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. 2018లో వీరు ఇరు కుటుంబసభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత ఇద్దరూ. ఇద్దరూ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా గడిపేస్తున్నారు. గతేడాది పఠాన్, జవాన్ చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ ఖాతాలో వేసుకుంది దీపికా. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి.

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న కల్కి 2898 AD చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. ఈ సినిమాకు భారీ మొత్తంలోనే పారితోషికం తీసుకుంటున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. గతంలో సూపర్ హిట్ అయిన పద్మావత్ సినిమాకు రూ. 13 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంది. ఈ చిత్రాన్ని సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కించారు. స్టాక్ గ్రో, ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ ప్రకారం.. 2024లో దీపికా వార్షిక ఆదాయం రూ. 40 కోట్లు దాటింది. అంటే ఆమె సినిమాల ఫీజు రూ.15 కోట్లు పెరిగింది. బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల కోసం ఆమె 7-10 కోట్ల రూపాయల వరకు వసూలు చేస్తుంది.

ఇక రణవీర్ సింగ్ సినీ పరిశ్రమలోనే అత్యధిక పారితోషికం తీసుకునే హీరోలలో ఒకరు. ఒక్కో చిత్రానికి దాదాపు రూ. 20 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటారు. ఆతడి వార్షిక వేతనం రూ. 21 కోట్లు. 2010లో బ్యాండ్ బాజా బారత్ సినిమాతో తెరంగేట్రం చేశాడు. అటు యాడ్స్ లో అత్యధికంగా సంపాదిస్తాడు రణవీర్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.