
బాలీవుడ్ నటుడు నదీమ్ ఖాన్ లైంగిక వేధింపుల కేసులో అరెస్టు అయ్యారు. ఇటీవల రిలీజైన బ్లాక బస్టర్ మూవీ ‘ధురంధర్’ సినిమాలో బందిపోటు రెహమాన్ డకైట్ ఇంటి వంటవాడు అఖ్లాక్ పాత్రలో నదీమ్ యాక్ట్ చేశాడు. అయితే ఇప్పుడు అతనిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. నదీమ్ ఖాన్ గత 10 సంవత్సరాలుగా ఒక ఇంటి పనిమనిషిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపణలు వచ్చాయి. బాధితురాలిని పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి అఘాయిత్యానికి పాల్పడుతున్నాడని పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. లైంగిక వేధింపులకు సంబంధించిన విషయం కావడంతో పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి.. ఈమె 2015లో నదీమ్ ఖాన్‌ను కలిసింది. ఆ సమయంలో ఆమెకు 31 సంవత్సరాలు. ఆమె ఇంట్లో పనిమనిషిగా చేరింది. తరువాత, అది శారీరక సంబంధంగా మారింది. ఇద్దరూ దగ్గరయ్యారు. ఈ సమయంలో, నదీమ్ ఖాన్ ఆమెను వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చాడు. ఇది 10 సంవత్సరాలు కొనసాగింది. అయితే ఇప్పుడు నదీమ్ పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు. అందుకే బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
ప్రాథమిక దర్యాప్తు నిర్వహించిన తర్వాత నదీమ్ ఖాన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. తదుపరి దర్యాప్తు లో భాగంగా అధికారులు అదనపు స్టేట్‌మెంట్‌లను నమోదు చేసి, ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను పరిశీలించే అవకాశం ఉంది. ఇక ధురంధర్ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను దుమ్ముదులుపుతోంది. గతేడాది డిసెంబర్ 05న రిలీజైన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. రూ. 1300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి అత్యధిక కలెక్షన్లు సాధించిన భారతీయ సినిమాల జాబితాల్లో ఒకటిగా నిలిచింది. ఉరి’ ఫేమ్ ఆదిత్య ధర్ డైరెక్ట్ చేసిన స్పై ఈ యాక్షన్ థ్రిల్లర్ లో అక్షయ్ ఖన్నా, సారా అర్జున్, ఆర్. మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా జనవరి 30న నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుందని సమాచారం. అలాగే ఈ బ్లాక్ బస్టర్ సినిమా సీక్వెల్ మార్చి 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
Actor #NadeemKhan, who was last seen in the film #Dhurandhar, has been arrested by Malvani police for allegedly raping his domestic worker over nearly 10 years on the false promise of marriage. The complainant, a 41-year-old woman, stated that she came into contact with Khan in… pic.twitter.com/EI9aPh7Ue2
— News9 (@News9Tweets) January 26, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి