AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: నాన్న ఒడిలో ఉన్న చిన్నారి పాన్ ఇండియా స్టార్.. విమర్శలను దాటుకొని ప్రపంచం మెచ్చిన హీరోయిన్..

నాన్న ఒడిలో ఉన్న ఆ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయిన్. సౌత్ అమ్మాయి అయినా నార్త్ ఇండస్ట్రీలో సత్తా చాటుతుంది. నటిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలనే తపనతో ఒంటరిగా ముంబై వెళ్లిన బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్ టాప్ హీరోయిన్. అలాగే బీటౌన్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే తారలలో ఒకరు.

Tollywood: నాన్న ఒడిలో ఉన్న చిన్నారి పాన్ ఇండియా స్టార్.. విమర్శలను దాటుకొని ప్రపంచం మెచ్చిన హీరోయిన్..
Actress 1
Rajitha Chanti
|

Updated on: Jul 09, 2024 | 5:23 PM

Share

సోషల్ మీడియాలో సెలబ్రెటీలకు సంబంధించిన ప్రతి చిన్న విషయం క్షణాల్లో వైరలవుతుంది. ముఖ్యంగా తారల చిన్ననాటి ఫోటోస్, స్కూల్, కాలేజీ డేస్ గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ కూడా ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే ఇటీవల హీరోహీరోయిన్స్ చైల్డ్ హుడ్ ఫోటోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఓ పాన్ ఇండియా స్టార్ చిన్ననాటి ఫోటో కూడా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. పైన ఫోటోను చూశారు కదా. అందులో నాన్న ఒడిలో ఉన్న ఆ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయిన్. సౌత్ అమ్మాయి అయినా నార్త్ ఇండస్ట్రీలో సత్తా చాటుతుంది. నటిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలనే తపనతో ఒంటరిగా ముంబై వెళ్లిన బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్ టాప్ హీరోయిన్. అలాగే బీటౌన్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే తారలలో ఒకరు. ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె.

దీపికా పదుకొణె… బెంగుళూరు అమ్మాయి. ఆమె తండ్రి ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రకాష్ పదుకొణె. చిన్న వయసు నుంచే నటనపై ఆసక్తి పెంచుకున్న దీపికా.. గ్రాడ్యూయేషన్ కంప్లీట్ కాగానే ముంబై చేరుకుంది. అక్కడే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. తొలి సినిమానే బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ సరసన అందుకుంది. ఆ తర్వాత హిందీలో ఎన్నో హిట్ చిత్రాల్లో మెప్పించింది. ప్రస్తుతం దీపిక వయసు 37 సంవత్సరాలు. ఇప్పటికే అనేక చిత్రాలు, వాణిజ్య ప్రకటనలలో మెరిసింది.

ప్రస్తుతం కల్కి 2898 ఏడీ సక్సెస్ ఎంజాయ్ చేస్తుంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ఈ మూవీలో కథానాయికగా కనిపించింది. ఈ మూవీతోనే సౌత్ అడియన్స్ ముందుకు వచ్చింది. గతేడాది జవాన్, పఠాన్ చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ హిట్స్ అందుకున్న దీపికా.. ఇప్పుడు కల్కితో మరో హిట్ ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఇన్ స్టాలో దీపికాకు 8 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. త్వరలోనే అమ్మగా ప్రమోషన్ పొందనుంది దీపికా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఊరంతా ఒకటే పేరు..గూళ్యం గ్రామ ప్రత్యేక నామకరణ సంప్రదాయం తెలిస్తే
ఊరంతా ఒకటే పేరు..గూళ్యం గ్రామ ప్రత్యేక నామకరణ సంప్రదాయం తెలిస్తే
ప్రయాణికుల మనసులు దోచేస్తున్న ఆర్టీసీ..
ప్రయాణికుల మనసులు దోచేస్తున్న ఆర్టీసీ..
భార్యాభర్తల కోసం బెస్ట్ స్కీమ్‌.. రూ.2 లక్షలపై రూ.90 వేల వడ్డీ
భార్యాభర్తల కోసం బెస్ట్ స్కీమ్‌.. రూ.2 లక్షలపై రూ.90 వేల వడ్డీ
ఐపీఎల్ 2026 వేలం ఎప్పుడు.. లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలంటే ?
ఐపీఎల్ 2026 వేలం ఎప్పుడు.. లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలంటే ?
భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం..!
భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం..!
డిసెంబర్ 31 లోపు ఈ 5 పనులను పూర్తి చేయండి.. లేకుంటే ఇబ్బందులే..
డిసెంబర్ 31 లోపు ఈ 5 పనులను పూర్తి చేయండి.. లేకుంటే ఇబ్బందులే..
మరణించిన వ్యక్తి బంధువులలో ఎవరు తల గుండు చేయించుకోవాలి..?
మరణించిన వ్యక్తి బంధువులలో ఎవరు తల గుండు చేయించుకోవాలి..?
భారత్-దక్షిణాఫ్రికా మొదటి టీ20లో ఐదు భారీ రికార్డులు బ్రేక్
భారత్-దక్షిణాఫ్రికా మొదటి టీ20లో ఐదు భారీ రికార్డులు బ్రేక్
భారత్‌లో అమ్ముడవుతున్న అత్యంత ఖరీదైన కారు..ధర తెలిస్తే షాకవుతారు
భారత్‌లో అమ్ముడవుతున్న అత్యంత ఖరీదైన కారు..ధర తెలిస్తే షాకవుతారు
పొద్దున్నే చాయ్ బిస్కెట్లు తింటున్నారా..? ఎంత డేంజరో తెలుసుకోండి!
పొద్దున్నే చాయ్ బిస్కెట్లు తింటున్నారా..? ఎంత డేంజరో తెలుసుకోండి!