Shah Rukh Khan: కొడుకు కోసం చొక్కా విప్పేసిన బాలీవుడ్ కింగ్ ఖాన్.. కారణం ఏంటంటే

పఠాన్, జవాన్, డంకి సినిమాలతో బాలీవుడ్ బాక్సాఫీస్ కు తానే బాద్షా అని మరో సారి నిరూపించాడు. పఠాన్, జవాన్ సినిమాలు వెయ్యి కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేశాయి. డంకి సినిమా పర్లేదు అనిపించుకున్నపటికీ కలెక్షన్స్ మాత్రం బాగానే రాబట్టింది. సినిమాలతో పాటు షారుఖ్ అనేక బిజినెస్ లు కూడా చేస్తున్నాడు. అలాగే చాలా బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్నాడు. వీటన్నింటికీ భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

Shah Rukh Khan: కొడుకు కోసం చొక్కా విప్పేసిన బాలీవుడ్ కింగ్ ఖాన్.. కారణం ఏంటంటే
Aryan Khan

Updated on: Feb 26, 2024 | 7:36 AM

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. దాదాపు నాలుగేళ్ళ తర్వాత వరుసగా మూడు సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టాడు కింగ్ ఖాన్. పఠాన్, జవాన్, డంకి సినిమాలతో బాలీవుడ్ బాక్సాఫీస్ కు తానే బాద్షా అని మరో సారి నిరూపించాడు. పఠాన్, జవాన్ సినిమాలు వెయ్యి కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేశాయి. డంకి సినిమా పర్లేదు అనిపించుకున్నపటికీ కలెక్షన్స్ మాత్రం బాగానే రాబట్టింది. సినిమాలతో పాటు షారుఖ్ అనేక బిజినెస్ లు కూడా చేస్తున్నాడు. అలాగే చాలా బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్నాడు. వీటన్నింటికీ భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అయితే తాజాగా కొడుకు కోసం షారుఖ్ చొక్కా విప్పేసి మరి ఫోటోలకు ఫోజులిచ్చాడు. కారణం ఏంటంటే..

షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డాడు. ఆ తర్వాత ఆయన పేరు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆ తర్వాత ఆర్యన్ ఖాన్ కాస్త డల్ అయ్యాడు. ఇప్పుడు తిరిగి యాక్టివ్‌ అయ్యాడు. సొంతంగా దుస్తుల బ్రాండ్ ప్రారంభించిన ఆర్యన్ ఖాన్.. దాని ప్రమోషన్ కోసం తన తండ్రిని ఉపయోగించుకుంటున్నాడు.

షారుఖ్ ఖాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్‌లో, అతను చొక్కా లేకుండా కనిపించాడు. ఈ ఫొటోకు తన కొడుకు దుస్తుల బ్రాండ్‌ను ట్యాగ్ చేశాడు షారుఖ్. ఈ ఫోటోకు 20 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. తన తండ్రి సపోర్ట్ చూసి ఆర్యన్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆర్యన్ ఖాన్ దుస్తుల బ్రాండ్ చాలా ఖరీదైనది. దీనిపై పలువురు పెదవి విరిచారు కూడా.. ‘ఆస్క్ SRK’ సమయంలో, షారుఖ్ ఖాన్‌పై కూడా దీనిపై ఫిర్యాదు చేశారు. ‘ఆర్యన్ నాకు కూడా డిస్కౌంట్ ఇవ్వడు’ అంటూ అందరి నోళ్లు మూయించాడు షారుక్ ఖాన్. ఒక్క జాకెట్ కోసం అక్కడ రూ.లక్షలు వెచ్చించాల్సి వస్తోంది. ఇక ఆర్యన్ ఖాన్ హీరోగా కాకుండా దర్శకుడిగా మారాలని కలలు కంటున్నాడు. కొత్త వెబ్ సిరీస్‌ని కూడా నిర్మిస్తున్నాడు. షారుఖ్ ఖాన్ ‘రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్’  దీనిని నిర్మిస్తుంది.

షారుఖ్ ఖాన్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్ ..

ఆర్యన్ ఖాన్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.