Sri Sri Ravi Shankar Biopic: మ‌రో ఆస‌క్తిక‌ర బ‌యోపిక్‌కు రంగం సిద్ధం.. 21 భాష‌లు.. 100కు పైగా దేశాల్లో..

Sri Sri Ravi Shankar Biopic: ఇటీవ‌లి కాలంలో బ‌యోపిక్‌ల హ‌వా కొన‌సాగుతోంది. రాజ‌కీయ నాయ‌కుల నుంచి సినీ తారలు, క్రీడాకారుల వ‌ర‌కు అంద‌రి జీవిత క‌థల‌ ఆధారంగా సినిమాలు తెర‌కెక్కిస్తున్నారు...

Sri Sri Ravi Shankar Biopic: మ‌రో ఆస‌క్తిక‌ర బ‌యోపిక్‌కు రంగం సిద్ధం.. 21 భాష‌లు.. 100కు పైగా దేశాల్లో..
Sri Sri Ravi Shakar

Updated on: May 14, 2021 | 4:58 PM

Sri Sri Ravi Shankar Biopic: ఇటీవ‌లి కాలంలో బ‌యోపిక్‌ల హ‌వా కొన‌సాగుతోంది. రాజ‌కీయ నాయ‌కుల నుంచి సినీ తారలు, క్రీడాకారుల వ‌ర‌కు అంద‌రి జీవిత క‌థల‌ ఆధారంగా సినిమాలు తెర‌కెక్కిస్తున్నారు. బ‌యోపిక్‌ల‌కు ప్ర‌జాద‌ర‌ణ కూడా ఎక్కువ‌గా ల‌భిస్తుండ‌డంతో మూవీ మేక‌ర్స్ ఇలాంటి చిత్రాల‌ను తెర‌కెక్కించ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నారు. అయితే తాజాగా బాలీవుడ్‌లో మ‌రో ఆస‌క్తిక‌ర బ‌యోపిక్‌కు రంగం సిద్ధ‌మ‌వుతోంది.
తాజాగా గురుదేవ్ శ్రీ శ్రీ ర‌విశంక‌ర్ జీవిత క‌థ ఆధారంగా ఓ సినిమా రానుంది. నేడు (శుక్ర‌వారం) ర‌విశంక‌ర్ పుట్టిన రోజు… ఈ సంద‌ర్భంగా ఆయ‌న బ‌యోపిక్‌ను తెర‌కెక్కిస్తున్న‌ట్లు ప్ర‌ముఖ ద‌ర్శ‌క నిర్మాత క‌ర‌ణ్ జోహార్ అధికారికంగా ప్ర‌క‌టించారు. ‘ఫ్రీ: ద అన్‌టోల్డ్‌ స్టోరీ ఆఫ్‌ గురుదేవ్‌ శ్రీ శ్రీ రవిశంకర్‌’ అనే టైటిల్‌తో ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. గురుదేవ్ శ్రీ శ్రీ ర‌విశంక‌ర్ జీవితంలో చోటుచేసుకున్న ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను ఈ సినిమాలో పొందుప‌ర‌చ‌నున్నారు. ఈ చిత్రానికి మాంటో బ‌స్సి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా సానుకూల ధృక్ప‌థాన్ని పెంపొందించ‌డ‌మే త‌మ ముఖ్య ఉద్దేశ‌మ‌ని చిత్ర నిర్మాత క‌ర‌ణ్ జోహార్ చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాను ఏకంగా 21 భాష‌ల్లో, ప్ర‌పంచ‌వ్యాప్తంగా సుమారు 100కు పైగా దేశాల్లో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు క‌ర‌ణ్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌టించారు.

సినిమాను ప్ర‌క‌టిస్తూ క‌ర‌ణ్ జోహార్ చేసిన ట్వీట్‌..

Also Read:  Publicity: ప్రచారం ఎదురు తన్నింది.. మోకాలి లోతు నీటిలో డొమినో పిజ్జా డెలివరీ.. ట్విట్టర్ లో పోస్ట్.. విమర్శిస్తున్న నెటిజన్లు!

Weather Report of AP: రాగాల మూడు రోజులు ఆంధ్రప్రదేశ్‌లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం..

Jagapathi Babu: మన బుద్దులు మారకుంటే.. ప్రకృతి మనకు గట్టిగా బుద్ది చెబుతుంది : జగపతిబాబు