
Saina Movie Trailer: ఇండియా బ్యాడ్మింటన్లో తొలి పతకం సాధించిన ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవిత కథపై బీటౌన్‌లో ‘సైనా’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో సైనా పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ పరిణితీ చోప్రా నటిస్తోంది. మార్చి 8 మహిళా దినోత్సవం సందర్బంగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్.
“దారిలో వెళ్ళడం ఒకటైతే దారి చూపటం మరోకటి.. నువ్వు ఆ రెండో దానిపై దృష్టి సారించాలి” అని సైనాకు తన తల్లి చెప్పే డాలాగ్తో ప్రారంభమవుతుంది. సైనా పాత్రలో ఒదిగిపోయేందుకు పరిణితి పడిన కష్టం కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తోంది. ఈ సినిమా కోసం బ్యాడ్మింటన్లో ప్రత్యేక శిక్షణ తీసుకోవడమే కాకుండా.. పరిణితి చోప్రా దాదాపు 10 కేజీల బరువు కూడా తగ్గిందట. ఇక సైనా నేహ్వాల్.. బ్యాడ్మింటన్ అకాడమీలో అడుగుపెట్టినప్పటి నుంచి ఒలంపిక్స్ మెడల్ గెలిచి వరల్డ్ నెంబర్ వన్‌గా నిలిచేవరకు సైనా పడిన తన జీవితంలో ఎదుర్కోన్న ప్రతి ఒక సంఘటనను కళ్ళకు కట్టినట్టుగా చూపించే ప్రయత్నం చేశారు మేకర్స్. ఇక ముఖ్యంగా ఇందులో “చైనా వాల్‌ను బద్ధలు కొడతా”.. అంటూ సైనా చెప్పే మరో డైలాగ్‌తో ఈ సినిమా మరింత ఆసక్తిని పెంచాయి. ఈ చిత్రాన్ని టీ సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ తెరకెక్కిస్తుండగా.. అమోల్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. ముందుగా ఈ సినిమాలోని సైనా పాత్ర కోసం శ్రద్ధ కపూర్ అనుకున్నారట.. అయితే కొన్ని కారణాల వలన శ్రద్ధా ఇందులో నటించలేదు. ఆ తర్వాత పరిణితీ చోప్రాను తీసుకున్నారట. సైనా నేహ్వాల్ ఒలింపిక్స్‌లో మెడల్ సాధించిన తొలి బాట్మింటన్ క్రీడాకారిణి. కామన్ వెల్త్ గేమ్స్‌లో ఐదు పతకాలు.. అంతేకాదు అర్జున అవార్డుతో పాటు రాజీవ్ ఖేల్ రత్నతో పాటు పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు ఈమె ప్రతిభను వెతుక్కుంటూ వచ్చాయి. ఈ సినిమాను మార్చి 26న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.