AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kareena Kapoor: బాయ్ కాట్ ట్రెండ్ పై స్పందించిన బాలీవుడ్ బ్యూటీ.. ఇది మంచిది కాదంటున్న కరీనా

బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ కూడా ఈ విషయం పై స్పందించింది. బాలీవుడ్ సినిమాలకు ఇది మంచి పరిణామం కాదు అని ఆమె అభిప్రాయపడింది.

Kareena Kapoor: బాయ్ కాట్ ట్రెండ్ పై స్పందించిన బాలీవుడ్ బ్యూటీ.. ఇది మంచిది కాదంటున్న కరీనా
Kareena Kapoor
Rajeev Rayala
|

Updated on: Jan 23, 2023 | 9:54 AM

Share

ఇటీవల బాలీవుడ్ లో బాయ్ కాట్ అనే నినాదం ఎక్కువగా వినిపిస్తోంది. ఏ సినిమా రిలీజ్ అవుతున్నా.. బాయ్ కాట్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే చాలా సినిమాల పై ఈ ప్రభావం పడింది. చిన్న సినిమా పెద్ద సినిమా అని లేకుండా అన్ని సినిమాలకు ఈ బాయ్ కాట్ సెగ తగులుతోంది. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో హిట్ రేషియో చాలా తక్కువ అయ్యింది. పెద్ద సినిమాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేక డిజాస్టర్స్ గా నిలుస్తున్నాయి. ఎన్నో అంచనాలు పెట్టుకున్న అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా సినిమా దారుణంగా డిజాస్టర్ గా నిలిచింది. రీసెంట్ గా వచ్చిన రణవీర్ సింగ్ సర్కస్ సినిమా కూడా అంతే.. వీటి పరాజయాల వెనక బాయ్ కాట్ ప్రభావం కూడా ఉందంటున్నారు విశ్లేషకులు.. ఇప్పటికే పలువురు సినిమా తారలు బాయ్ కాట్ పై ఆవేదన వ్యక్తం చేశారు.

తాజాగా బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ కూడా ఈ విషయం పై స్పందించింది. బాలీవుడ్ సినిమాలకు ఇది మంచి పరిణామం కాదు అని ఆమె అభిప్రాయపడింది. బాయ్ కాట్ ట్రెండ్ సినీ పరిశ్రమకు మంచిది కాదని.. దీంతో తాను ఏకీభవించననిచెప్పుకొచ్చింది. బాయ్ కాట్ ట్రెండ్ ఇలాగే కొనసాగితే ప్రేక్షకులను తాము ఎలా ఎంటర్టైన్ చేయగలమని ప్రశ్నించింది. సినిమాలే లేకపోతే మీకు వినోదం ఎక్కడి నుంచి వస్తుందని అంటోంది కరీనా..

అయితే షారుఖాన్ నటిస్తున్న పఠాన్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మరోసారి బాయ్ కాట్ ట్రెండ్ మొదలైంది. ఈ మూవీలోని బేషరమ్ సాంగ్ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. దాంతో ఈ సినిమాను బాయ్ కాట్ చేయాలనీ సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు కొందరు. ఈ నేపథ్యంలో కరీనా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు దారితీశాయి.

Follow Us
పోస్టాఫీసులో పేపర్ వర్క్ లేకుండానే డిపాజిట్లు, విత్‌డ్రాలు!
పోస్టాఫీసులో పేపర్ వర్క్ లేకుండానే డిపాజిట్లు, విత్‌డ్రాలు!
బాంబుతో ప్రియురాలిని బెదిరిద్దామనుకుంటే.. సజీవదహనమైన ప్రియుడు
బాంబుతో ప్రియురాలిని బెదిరిద్దామనుకుంటే.. సజీవదహనమైన ప్రియుడు
క్రెడిట్ కార్డు, డిజిటల్ మోసాలకు చెక్.. ఆర్‌బీఐ సంచలన నిబంధనలు!
క్రెడిట్ కార్డు, డిజిటల్ మోసాలకు చెక్.. ఆర్‌బీఐ సంచలన నిబంధనలు!
AUSW vs INDW Live Score: గెలిస్తే సెమీస్ రేసు.. లేదంటే ఇంటికే
AUSW vs INDW Live Score: గెలిస్తే సెమీస్ రేసు.. లేదంటే ఇంటికే
టిఫిన్‌ సెంటర్‌లో వడలు లాగించేస్తున్నారా.. ఈ వీడియో చూడండి
టిఫిన్‌ సెంటర్‌లో వడలు లాగించేస్తున్నారా.. ఈ వీడియో చూడండి
కరెంటు బిల్లు తగ్గించి.. ఇంటిని చల్లగా ఉంచే సరికొత్త టెక్నాలజీ..
కరెంటు బిల్లు తగ్గించి.. ఇంటిని చల్లగా ఉంచే సరికొత్త టెక్నాలజీ..
మురుగు కాల్వలో బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. ఇదో వెరైటీ నిరసన!
మురుగు కాల్వలో బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. ఇదో వెరైటీ నిరసన!
వాట్సప్‌లో పెయిడ్‌ సేవలు.. ‘వాట్సప్ ప్లస్’ వచ్చేసిందోచ్‌
వాట్సప్‌లో పెయిడ్‌ సేవలు.. ‘వాట్సప్ ప్లస్’ వచ్చేసిందోచ్‌
గోదావరి ఒడ్డున ముగ్గులాంటి ఆకారం.. ఏంటా అని దగ్గరికెళితే..
గోదావరి ఒడ్డున ముగ్గులాంటి ఆకారం.. ఏంటా అని దగ్గరికెళితే..
త్వరలోనే కావ్య మారన్, అనిరుధ్ పెళ్లి.. లీక్ చేసిన నటుడు..!
త్వరలోనే కావ్య మారన్, అనిరుధ్ పెళ్లి.. లీక్ చేసిన నటుడు..!