Salman Khan: ఫొటోగ్రాఫర్ల‌పై సల్మాన్ ఖాన్ సీరియస్.. వైరల్‌గా మారిన వీడియో

|

Dec 20, 2023 | 7:59 PM

నటుడు సోహైల్ ఖాన్ పుట్టినరోజు రీసెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ పుట్టినరోజు వేడుకకు సల్మాన్‌ఖాన్‌తో సహా కుటుంబం మొత్తం హాజరయ్యారు . పార్టీని నుంచి వెళుతున్న సమయంలో, సల్మాన్ తన తల్లి సల్మా ఖాన్‌కు మెట్లు దిగడానికి సహాయం చేస్తూ కనిపించదు. అదే సమయంలో ఫోటోగ్రాఫర్‌లపై విరుచుకుపడటం ఈ వీడియోలో కనిపించింది.కెమెరా మెన్ల పై ఆగ్రహం వ్యక్తం చేశాడు సల్మాన్ ఖాన్. సల్మాన్‌కి సంబంధించిన ఈ వీడియో..

Salman Khan: ఫొటోగ్రాఫర్ల‌పై సల్మాన్ ఖాన్ సీరియస్.. వైరల్‌గా మారిన వీడియో
Salman Khan
Follow us on

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే టైగర్  సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఇదిలా ఉంటే సల్మాన్ ఖాన్ కు వివాదాలు కొత్తేమి కాదు. ఇప్పటికే ఆయన చాలా సార్లు ఇలాంటి వివాదాలతో వార్తల్లో నిలిచాడు. తాజాగా మరోసారి సల్మాన్ ఖాన్ పేరు వార్తల్లోకి ఎక్కింది. తాజాగా సల్మాన్ ఖాన్ కోప్పడుతున్న వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. అసలు విషయం ఏంటంటే..

నటుడు సోహైల్ ఖాన్ పుట్టినరోజు రీసెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ పుట్టినరోజు వేడుకకు సల్మాన్‌ఖాన్‌తో సహా కుటుంబం మొత్తం హాజరయ్యారు . పార్టీని నుంచి వెళుతున్న సమయంలో, సల్మాన్ తన తల్లి సల్మా ఖాన్‌కు మెట్లు దిగడానికి సహాయం చేస్తూ కనిపించదు. అదే సమయంలో ఫోటోగ్రాఫర్‌లపై విరుచుకుపడటం ఈ వీడియోలో కనిపించింది.కెమెరా మెన్ల పై ఆగ్రహం వ్యక్తం చేశాడు సల్మాన్ ఖాన్. సల్మాన్‌కి సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

పార్టీ పూర్తయిన తర్వాత సల్మాన్ తన తల్లి చేయి పట్టుకుని కారు వద్దకు తీసుకెళ్లాడు. మెట్లు దిగుతూ తల్లి చేయి పట్టుకున్నాడు. అతను తన తల్లిని కారులో ఎక్కించే ముందు అక్కడే ఉన్న కెమెరా మేన్స్ పై సీరియస్ అయ్యాడు. సల్మాన్ అతని తల్లితో పాటు, సల్మాన్ తండ్రి సలీం ఖాన్, అతని రెండవ భార్య హెలెన్, సోదరుడు అర్బాజ్ ఖాన్, సోదరి అర్పితా ఖాన్ , ఆమె భర్త ఆయుష్ శర్మ, అర్పిత-ఆయుష్ పిల్లలు అహిల్ , ఆయుష్ శర్మ, రితీష్ దేశ్‌ముఖ్, జెనీలియా దేశ్‌ముఖ్, వత్సల్ శేత్, ఇషితా దత్తా. ఈ బర్త్ డే పార్టీకి హాజరయ్యారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.