Bollywood Celebrities: సినీ వినీలాకాశంలో వెలిగే ధ్రువతారలుగా నటీనటులను సామాన్యులు ఓ రేంజ్ లో చూస్తారు. ఇక సినీ ప్రపంచంలో అడుగు పెట్టి.. ఏమీ లేనివారు కోటీశ్వరులను వారు ఉన్నారు.. కోట్లకు కోట్లు సంపాదించి చివరి స్టేజ్ లో కూటికి కూడా లేకుండా మరణించిన వారు ఉన్నారు. ఇక వీరు తీసుకునే రెమ్యునరేష్ గడిపే విలాసవంతమైన జీవితం గురించి అందరికీ తెలిసిందే. అయితే వెండి తెరపై ఎంతో లైఫ్ గడిపి.. చివరికి జీవిత సారం ఇదేనంటూ సన్యాసం తీసుకున్న హీరోయిన్లు కూడా ఉన్నారు.
బిగ్ బాస్ ద్వారా బుల్లి తేర ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టిన సోఫియా హయత్ తాను సన్యాసం తీసుకున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించింది. దేవుడి దర్శనంతో తన తొమ్మిది జన్మల గురించి తెలిసిందని వెల్లడించింది. ఆధ్యాత్మిక మార్గం ;ప్ నడవనున్నానని ప్రకటించింది. అయితే ఈ భామ సన్యాసం తీసుకోక ముందు నూలుపోగు లేకుండా ఐస్ బకెట్ ఛాలెంజ్ విసిరిన సంగతి తెలిసిందే.
1984 మిస్ ఇండియా ఫైనలిస్టుల్లో ఒకరు బర్ఖా మదన్ . పలు టీవీ సీరియల్స్‌తో పాటు సినిమాల్లోనూ నటించింది. నటిగా మంచి గుర్తింపు పొందుతున్న సమయంలోనే ఆమె బౌద్ధమతం స్వీకరించింది. సిక్కింలోని బౌద్ధమఠాన్ని చూసేందుకు వెళ్లిన బర్ఖా అక్కడి ఆధ్యాత్మిక వాతావరణం తనకు బాగా నచ్చి సన్యాసినిగా మారింది.
బ్లాక్ బ్యూటీ అను అగర్వాల్.. అంతర్జాతీయ మోడల్‌గా ఖ్యాతిగాంచింది ఈ ఢిల్లీ బ్యూటీ. మొదటి సినిమా ఆషీకీ సినిమాతో కుర్రకారుగుండెల్లో గుబులు సృష్టించిన అను అవకాశాలున్న ఉన్న సమయంలోనే ఉత్తరాఖండ్‌లోని యోగా ఆశ్రమంలో యోగినిగా చేరింది. ఈ ఆధ్యాత్మిక వాతావరణంలోనే తన జీవితం సంపూర్ణంగా ఉందని తెలిపింది.
బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో నూ 1990లో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసిన నటి నటి మమతా కులకర్ణి. ఈమె జీవితం ఎప్పుడూ వివాదాల మయం ఈ నేపథ్యంలో ఆధ్యాత్మిక చింతనతో సన్యాసినిగా మారింది.
Also Read: తెలంగాణ సీఎం కేసీఆర్ కు కరోనా పాజిటివ్.. పర్యవేక్షిస్తున్న వైద్య సిబ్బంది
ఏపీలో రాగాల మూడు రోజులకు వాతావరణ సూచన.. అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం