Actress: హర హర మహాదేవ.. 400 మెట్లు ఎక్కి మహా శివుడిని దర్శించుకున్న ప్రముఖ నటి.. వీడియో ఇదిగో

తన సోషల్ మీడియా పోస్టులతో తరచూ వార్తల్లో ఉండడం ఈ అందాల తారకు అలవాటు. అందుకే నెట్టింట ఈ ముద్దుగుమ్మకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముస్లిం మతానికి ఈ ప్రముఖ నటి తాజాగా 400 మెట్లు ఎక్కి మహా శివుడిని దర్శించుకుంది.

Actress: హర హర మహాదేవ.. 400 మెట్లు ఎక్కి మహా శివుడిని దర్శించుకున్న ప్రముఖ నటి.. వీడియో ఇదిగో
Bollywood Actress

Updated on: Jan 26, 2025 | 5:38 PM

ముస్లిం మతానికి చెందినప్పటికీ, హిందూ దేవతలను సమానంగా పూజించే సినిమా తారలు చాలా మంది ఉన్నారు. షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ హిందూ దేవతలను అమితంగా పూజిస్తుంది. అదేవిధంగా, బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్‌ తరచూ హిందూ దేవాలయాలు, పుణ్య క్షేత్రాలను దర్శించుకుంటుంది. సారా తండ్రి సైఫ్ ఒక ముస్లిం. ఆమె తల్లి అమృతా సింగ్. ఈ కారణంగానే సారా రెండు మతాలను నమ్ముతుంది. ఆమె శివుడికి గొప్ప భక్తురాలు కూడా. అలాంటి బాలీవుడ్ సెలబ్రిటీ మరొకరు ఉన్నారు. ముస్లిం మతానికి చెందిన ఈ నటి శంకర భగవానుడి భక్తురాలు కూడా. తాజాగా ఆమె రాజస్థాన్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కనకోలార్ కొండపై ఉన్న భోలేనాథ్‌ని దర్శించుకుంది. శివనామస్మరణ చేస్తూ ఏకంగా 400 మెట్లు ఎక్కింది. ఆమె మరెవరో కాదు తన విచిత్రమైన డ్రెస్ లతో వార్తల్లో ఉండే ఉర్ఫీ జావేద్. ఉర్ఫీ ఎప్పుడూ ఏదో ఒక కారణంతో వార్తల్లో ఉంటుందీ అందాల తార. ఆమె ఫ్యాషన్ సెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వింత వింత దుస్తులను ధరించి ఫోటోషూట్ చేస్తుంటుంది. ఆమె ఫోటోలు, వీడియోలు ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే దీని ద్వారానే ఉర్ఫీ చాలా డబ్బు లు సంపాదిస్తుంది. 27 ఏళ్ల ఈ నటికి సుమారు 170 కోట్ల ఆస్తులున్నాయి. సోషల్ మీడియా ద్వారానే ఆమె కోట్ల ఆదాయం ఆర్జిస్తోంది.

 

ఇవి కూడా చదవండి

ఉర్ఫీ జావేద్ ముస్లిం అయినప్పటికీ శివుడిని ఆరాధిస్తుంది. ఆమె ఇటీవల రాజస్థాన్ లోని కనకోలార్ కొండపై ఉన్న కంబేశ్వర్ మహాదేవ ఆలయాన్ని సందర్శించింది. ఈ ఆలయానికి చేరుకోవాలంటే 400 మెట్లు ఎక్కడం తప్పనిసరి. దీంతో ఉర్ఫీ శివనామస్మరణ చేస్తూ 400 మెట్లు ఎక్కి భోలేనాథ్‌ని దర్శించుకుది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుందీ అందాల తార. ఈ ఫొటోల్లో ఉర్ఫీ సింపుల్ గా కుర్తా పైజామా ధరించి కనిపించింది. ప్రస్తుతం ఉర్ఫీ ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. చాలామంది నెటిజన్లు ఉర్ఫీని ప్రశంసిస్తున్నారు.

 

‘మొదటిసారి నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను. మిమ్మల్ని ఇలా చూసినందుకు చాలా సంతోషంగా ఉంది…. మా అందమైన సనాతన ధర్మానికి స్వాగతం’ అని ఒకరు కామెంట్ చేయగా, ‘నేను ఉర్ఫీని ఇష్టపడటానికి మరొక కారణం ఏమిటంటే ఆమె చాలా తటస్థంగా ఆచరణాత్మకంగా ఉంటుంది’ అని మరో నెటిజన్ కామెంట్స్ చేశాడు.

వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.