
Sunny Leone: 2011లో ప్రసారమైన హిందీ బిగ్‌బాస్ 5వ (Biggboss) సీజన్ ద్వారా భారతీయులకు పరిచయమైంది అందాల తార సన్నీ లియోన్. అనతికాలంలోనే ఇండియాలో భారీ ఫాలోయింగ్ సంపాదించుకుందీ బ్యూటీ. హిందీలో వరుస అవకాశాలు సొంతం చేసుకొని బాలీవుడ్‌లో (Bollywood) నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక సన్నీ లియోన్ సినిమా ప్రస్థానం కేవలం బాలీవుడ్‌కు మాత్రమే పరిమితం కాకుండా సౌత్‌కి కూడా చేరింది. తెలుగులోనూ నటించి మెప్పించిందీ బ్యూటీ. ప్రస్తుతం మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలోనూ సన్నీ నటిస్తోంది. ఇలా నార్త్‌తో పాటు సౌత్‌లోనూ సన్నీ హవా కొనసాగిస్తుంది.
ఇక సినిమాల విషయంలో ఎంత బిజీగా ఉన్నా వ్యక్తిగత జీవితానికి అంతే ప్రాధాన్యత ఇస్తుంది సన్నీ. ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా భర్త, పిల్లలతో సరదాగా గడుపుతుంటుంది. వారితో గడిపిన సంతోషకరమైన క్షణాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా భర్తతో చేసిన సందడికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. చీర కట్టులో బాస్కెట్ బాల్ ఆడుతూ అల్లరి చేసింది.
భర్త డేనియల్ వెబర్ ఆటపట్టిస్తుండగా బాస్కెట్ బాల్ ఆడుతూ తెగ సందడి చేసింది, యే లడ్కీ హై దివానా సాంగ్‌ను వీడియోకు జోడించి పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే ఇండియన్ చిత్ర పరిశ్రమకు పరిచయమై 10 ఏళ్లు గడిచిన తర్వాత సన్నీలియోన్ ఇటీవల తన సొంతింటి కలను నిజం చేసుకుంది. మొన్నటి వరకు అద్దె ఇంట్లో ఉన్న ఈ చిన్నది ముంబయిలో ట్రిబుల్ బెడ్ రూమ్‌ను కొనుగోలు చేసింది. ఈ విలాసవంతమైన పెంట్ హౌజ్‌కోసం సన్నీ ఏకంగా రూ. 16 కోట్లు ఖర్చు చేయడం విశేషం.
Also Read: Cervical Cancer: మహిళల్లో ఈ లక్షణాలు కనిపించినట్లయితే గర్భశయ క్యాన్సర్ కావచ్చు
Vodafone Idea: జియో, ఎయిర్‌టెల్‌కు పోటీగా వొడాఫోన్ ఐడియా.. తక్కువ ధరల్లో రెండు రీచార్జ్ ప్లాన్స్
Health Tips: అధిక బరువుతో బాధపడుతున్నారా.. పెరుగుతో కలిపి వీటిని తీసుకోండి.. ఆశ్చర్యపోయే ఫలితాలు..