Shivangi Joshi: కిడ్నీ సమస్యతో ఆస్పత్రి పాలైన స్టార్‌ హీరోయిన్‌.. కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నానంటూ ఎమోషనల్‌

ఇటీవల కాలంలో సామాన్యులతో పాటు సినీ సెలబ్రెటీలు వరుసగా అనారోగ్యం పాలవుతున్నారు. వివిధ కారణాలతో ఆస్పత్రుల పాలవుతున్నారు. తాజాగా మరో ప్రముఖ నటి, బుల్లితెర హీరోయిన్‌ శివాంగీ జోషీ తీవ్ర అనారోగ్యానికి గురైంది.

Shivangi Joshi: కిడ్నీ సమస్యతో ఆస్పత్రి పాలైన స్టార్‌ హీరోయిన్‌.. కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నానంటూ ఎమోషనల్‌
Shivangi Joshi
Follow us

|

Updated on: Mar 16, 2023 | 6:18 PM

ఇటీవల కాలంలో సామాన్యులతో పాటు సినీ సెలబ్రెటీలు వరుసగా అనారోగ్యం పాలవుతున్నారు. వివిధ కారణాలతో ఆస్పత్రుల పాలవుతున్నారు. తాజాగా మరో ప్రముఖ నటి, బుల్లితెర హీరోయిన్‌ శివాంగీ జోషీ తీవ్ర అనారోగ్యానికి గురైంది. కిడ్నీ సంబంధిత సమస్యలతో ఆస్పత్రిలో చేరింది. ఈ విషయాన్ని ఆమె సోషల్‌ మీడియా ద్వారా ఫ్యాన్స్‌కు షేర్‌ చేసింది. ఈ మేరకు ఆస్పత్రి బెడ్‌పై ట్రీట్‌మెంట్ తీసుకున్న ఫొటోను షేర్‌ చేసిన శివాంగీ.. కిడ్నీ ఇన్ఫెక్షన్స్‌తో బాధపడుతున్నట్లు పేర్కొంది. కాగా తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న చిన్నారి పెళ్లికూతురు 2 (హిందీలో బాలికా వధు 2) సీరియల్‌తో బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది శివాంగి జోషి. ఆతర్వాత హే రిస్తా క్యా ఖేల్తా హై ధారావాహికతో మరింత క్రేజ్‌ తెచ్చుకుంది. వీటితో పాటే బైంతేహా, బెగుసరాయి లాంటి సీరియల్స్‌తోనూ బాలీవుడ్ బుల్లితెర ప్రేక్షకులకు బాగా చేరువైంది. ఇక గతేడాది ప్రసారమైన ఖత్రోం కీ ఖిలాడీసీజన్‌ 12లోనూ వన్ ఆఫ్ ది కంటెస్టెంట్‌గా పాల్గొని ఆకట్టుకుంది. ఇలా బాలీవుడ్‌ బుల్లితెరపై తన అందం, అభినయంతో దూసుకెళుతోన్న శివాంగీ సడెన్‌గా ఆస్పత్రి పాలైంది.

‘హాలో.. మీ అందరికి ఒకటి చెప్పాలి. గత కొద్ది రోజులుగా నేను కఠిన పరిస్థితులను చూశాను. కిడ్నీ ఇన్ఫెక్షన్‌ వల్ల ఆస్పత్రిలో చేరాను. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, డాక్టర్స్‌ సహకారంతో ప్రస్తుతం కోలుకుంటున్నాను. నా ఆరోగ్యం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి. మీ శరీరాన్ని కాపాడుకోండి. ముఖ్యంగా శరీరాన్ని హైడ్రెట్‌ చేసుకోవాలి’ అని తన ఫ్యాన్స్‌, ఫాలోవర్స్‌కు సలహాలిచ్చింది శివాంగి. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. శివాంగీ ఆస్పత్రిలో చేరడంతో సహానటీనటులు, అభిమానులు, నెటిజన్లు ‘గెట్ వెల్ సూన్’ అని కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం  క్లిక్ చేయండి..