Sara Ali Khan: ట్రెడిషినల్‌గా గుడికి వెళ్లడం.. బికినీల్లో బీచ్‌లో ఎంజాయ్‌ చేయడం రెండూ ఇష్టమే: సారా

|

Jul 16, 2022 | 10:14 PM

Sara Ali Khan: బాలీవుడ్‌ స్టార్‌ కిడ్ సారా అలీఖాన్ ఎప్పుడూ హాట్ టాపికే. సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి తన మూవీ సెలక్షన్‌ నుంచి.. పర్సనల్ ట్రిప్స్ వరకు ప్రతీ విషయంలోనూ న్యూస్ మేకర్ అవుతోంది సారా.

Sara Ali Khan: ట్రెడిషినల్‌గా గుడికి వెళ్లడం.. బికినీల్లో బీచ్‌లో ఎంజాయ్‌ చేయడం రెండూ ఇష్టమే: సారా
Sara Ali Khan
Follow us on

Sara Ali Khan: బాలీవుడ్‌ స్టార్‌ కిడ్ సారా అలీఖాన్ ఎప్పుడూ హాట్ టాపికే. సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి తన మూవీ సెలక్షన్‌ నుంచి.. పర్సనల్ ట్రిప్స్ వరకు ప్రతీ విషయంలోనూ న్యూస్ మేకర్ అవుతోంది సారా. తాజాగా తన క్యారెక్టర్‌ గురించి సెన్సేషనల్‌ కామెంట్స్ చేశారు సారా అలీ ఖాన్‌. కేదార్‌నాథ్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన స్టార్ వారసురాలు సారా అలీఖాన్‌. పటౌడీల ఖాన్‌దాన్ నుంచి వచ్చిన ఈ భామ.. హిందూ సాంప్రదాయాలను కూడా గట్టిగా నమ్ముతుంది. అందుకే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తరువాత చాలా సందర్భాల్లో తీర్థయాత్రలు చేస్తూ కెమెరాల కంటపడిందీ ఖాన్‌ వారసురాలు. కాయిన్‌కి సెకండ్ సైడ్ కూడా ఉన్నట్టుగా ఓ వైపు డివోషనల్‌ ట్రిప్స్‌ చేస్తూనే మరో వైపు మాల్దీవ్స్‌లో బికినీలతో హాట్ ఫోజులు కూడా ఇచ్చిందీ స్టన్నింగ్‌ బ్యూటీ. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావటంతో నెగెటివ్ కామెంట్స్ వచ్చిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.

 అలా అనుకోవడంలో వింతేమీలేదు..
ఇదిలా ఉంటే తాజాగా తన ఆఫ్‌ స్క్రీన్ వర్సటాలిటీ గురించి క్లారిటీ ఇచ్చింది సారా. ‘ట్రెడిషనల్‌గా గుడి వెళ్లటం..  బికినీల్లో బీచ్‌లో ఎంజాయ్ చేయడం’… ఈ రెండూ నాకు ఇష్టమే.. నా క్యారెక్టర్‌ నాకే ఒక్కోసారి సర్‌ప్రైజింగ్‌గా అనిపిస్తుంది. అలాంటిది జనాలు సర్‌ప్రైజింగ్‌గా ఫీల్ అవ్వడం వింతేంకాదంటోంది సారా. స్టార్ కిడ్‌గా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చినా.. మూవీ సెలక్షన్‌లో మాత్రం డౌన్‌ టు ఎర్త్ ఫార్ములానే ఫాలో అవుతున్నారు ఈ బ్యూటీ. ఎక్కువగా బాలీవుడ్ టైర్‌ 2 హీరోస్‌తోనే సినిమాలు చేస్తూ తన మెటల్‌ ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడుతున్నారు. ఆల్రెడీ స్టార్‌ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సారా… ఇప్పుడు బాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్‌ హిట్ కోసం వెయిటింగ్‌లో ఉన్నారు. చివరిగా ధనుష్‌తో కలిసి అత్రంగిరేలో సందడి చేసిన సారా ప్రస్తుతం గ్యాస్‌ లైట్‌ అనే సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు లక్ష్మన్‌ ఉటేకర్‌ తెరకెక్కిస్తోన్న మరో చిత్రంలోనూ కనిపించనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..