Bollywood: డబ్బు కోసం సినిమాల్లో అలాంటి పనులు చేసిన హీరోయిన్.. ఇష్టంలేకపోయిన ..

గత కొన్ని రోజులుగా తన వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలతో వార్తల్లో నిలుస్తోంది నీనా గుప్తా. తన జీవితంలోని షాకింగ్ సంఘటనలను ఎప్పుడూ తన అభిమానులతో పంచుకుంటుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నీనా గుప్తా సినిమాల్లో తాను చేసిన అనవసరమైన పనుల గురించి చెప్పింది. నీనా గుప్తా మాట్లాడుతూ 'అవసరాన్ని బట్టి విషయాలు మారుతాయి.

Bollywood: డబ్బు కోసం సినిమాల్లో అలాంటి పనులు చేసిన హీరోయిన్.. ఇష్టంలేకపోయిన ..
Neena Gupta
Follow us

|

Updated on: May 25, 2024 | 2:01 PM

సినీరంగుల ప్రపంచంలో చాలా మంది తారలు తమకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకుంటారు. కానీ వ్యక్తిగత జీవితంలో ఎన్నో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటారు. ముఖ్యంగా నటీమణుల లైఫ్ అంత ఈజీగా సాగదు. హీరోయిన్స్ తమ వృత్తి జీవితంలో కూడా ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటారు. తాజాగా తన జీవితంలో కెరీర్ లో ఎదురైన చేదు ఘటనలను గుర్తుచేసుకుంది బాలీవుడ్ నటి నీనా గుప్తా. గత కొన్ని రోజులుగా తన వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలతో వార్తల్లో నిలుస్తోంది నీనా గుప్తా. తన జీవితంలోని షాకింగ్ సంఘటనలను ఎప్పుడూ తన అభిమానులతో పంచుకుంటుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నీనా గుప్తా సినిమాల్లో తాను చేసిన అనవసరమైన పనుల గురించి చెప్పింది. నీనా గుప్తా మాట్లాడుతూ ‘అవసరాన్ని బట్టి విషయాలు మారుతాయి. గతంలో డబ్బు అవసరం ఎక్కువగా ఉండటంతో చెడు, ఇష్టంలేని పనులు చేశాను. నేను చాలా సార్లు దేవుడిని ప్రార్థించాను. కొన్ని సినిమా విడుదల చేయవద్దు అని.. కానీ కాలంతో పాటు ప్రతిదీ మారుతుంది. ఇప్పుడు హాబీగా సినిమాలను ఎంచుకుంటున్నాను.’ అని అన్నారు.

‘సినిమా స్క్రిప్ట్ నచ్చకపోతే నేనే ఆ సినిమాకి ఒప్పుకోను. కానీ అంతకుముందు పరిస్థితి దారుణంగా ఉండేది. ఇండస్ట్రీకి కొత్త కావడంతో నో చెప్పలేకపోయాను. తొలిరోజులు చాలా కష్టంగా ఉండేవి. ముంబై వచ్చిన నాకు కొత్తగా ఉండేదు. ముంబైకి వచ్చిన మూడు నెలల్లోనే మళ్లీ ఇంటికి వెళ్లాలనిపించింది. కానీ ఇక్కడకు వచ్చాక మరో చోటుకు వెళ్లలేము. మంచి ఉద్యోగం వస్తుందనే ఆశతో ముంబైలో ఉండిపోయాను. అలా సినిమాల్లో అవకాశం వచ్చిన తర్వాత ఎన్నోసార్లు నాకు ఇష్టం లేని పాత్రలు పోషించాను. ఎందుకంటే నాకు అప్పుడు డబ్బు అవసరం. నచ్చని సినిమాలను కూడా ఒప్పుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది.

నీనా గుప్తా ఇటీవల ‘పంచాయతీ’ వెబ్ సిరీస్, ‘బధాయి హో’ వంటి చిత్రాల్లో ముఖ్యమైన పాత్రలు పోషించి అభిమానులను అలరించారు. 63 ఏళ్ల వయసులో కూడా నీనా గుప్తా వరుస సినిమాల్లో నటిస్తుంది. నీనా గుప్తా కూడా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. నెట్టింట నీనాకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
'డబ్బు'ల బెడ్‌రూం ఇళ్ల కేటాయింపులో వెలుగులోకి నయా మోసాలు
'డబ్బు'ల బెడ్‌రూం ఇళ్ల కేటాయింపులో వెలుగులోకి నయా మోసాలు
శుక్రవారం ఓటీటీ స్ట్రీమింగ్‌కు సూపర్ హిట్ సినిమాలు, సిరీస్‌లు
శుక్రవారం ఓటీటీ స్ట్రీమింగ్‌కు సూపర్ హిట్ సినిమాలు, సిరీస్‌లు
'ఆఫీసుకు రాకుండానే చాలామందికి జీతాలు..' లెక్కలు తేలుస్తోన్న సీఎం
'ఆఫీసుకు రాకుండానే చాలామందికి జీతాలు..' లెక్కలు తేలుస్తోన్న సీఎం
కలల ప్రాజెక్టులను సాకారం చేసేందుకు వడివడిగా సీఎం అడుగులు
కలల ప్రాజెక్టులను సాకారం చేసేందుకు వడివడిగా సీఎం అడుగులు
యోగా చేస్తున్నప్పుడు ఈ తప్పులు చేయకండి.. సమస్యలు తలెత్తవచ్చు!
యోగా చేస్తున్నప్పుడు ఈ తప్పులు చేయకండి.. సమస్యలు తలెత్తవచ్చు!
డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఇన్ స్టా పోస్ట్..
డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఇన్ స్టా పోస్ట్..
పవన్‌ను అభిమానించే స్రవంతి..తన కొడుకుకు ఏం పేరు పెట్టిందో తెలుసా?
పవన్‌ను అభిమానించే స్రవంతి..తన కొడుకుకు ఏం పేరు పెట్టిందో తెలుసా?
ఐఫోన్‌ కొనాలనుకునేవారికి గుడ్‌ న్యూస్‌.. వీటిపై భారీ డిస్కౌంట్‌
ఐఫోన్‌ కొనాలనుకునేవారికి గుడ్‌ న్యూస్‌.. వీటిపై భారీ డిస్కౌంట్‌
ఇక నుంచి ముద్రగడ పద్మనాభ రెడ్డి.. గెజిట్‌ విడుదల
ఇక నుంచి ముద్రగడ పద్మనాభ రెడ్డి.. గెజిట్‌ విడుదల
పాపం.. డార్లింగ్.. ప్రభాస్ కష్టాలు చూస్తే నవ్వాగదు..
పాపం.. డార్లింగ్.. ప్రభాస్ కష్టాలు చూస్తే నవ్వాగదు..