
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ చాలా రోజుల తర్వాత బయట కనిపించారు. ఒక పెళ్లి వేడుకలో సందడి చేశారు. సల్మాన్ తన స్నేహితుడైన అయాజ్ ఖాన్ వివాహానికి హాజరయ్యారు. ముంబయిలో జరిగిన ఈ పెళ్లి వేడుకకు హాజరైన అతను వధూవరులను ఆశీర్వదించారు. సల్మాన్ ఖాన్ తో పాటు అతని సోదరుడు సోహైల్ ఖాన్, మేనల్లుడు నిర్వాన్ కూడా ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. అయితే ఇటీవల జరుగుతున్న కొన్ని సంఘటనల నేపథ్యంలో సల్మాన్ ఖాన్ అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య తన స్నేహితుడి పెళ్లికి హాజరయ్యారు. ఇందుకోసం అతను వై ప్లస్ సెక్యూరిటీ సిబ్బందితో కల్యాణ మండపానికి వచ్చారు. అనంతరం నూతన వధూవరులను ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి.
కాగా ఇటీవల సల్మాన్ నివాసమైన గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌లోకి చొరబడేందుకు ఒక మహిళ ప్రయత్నించింది. ఇషా చాబ్రియా అనే 36 ఏళ్ల మహిళ నటుడి ఇంట్లోకి ప్రవేశించడండో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. బాంద్రా కోర్టులో ఆమెను హాజరుపరిచగా.. న్యాయస్థానం ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించింది.
స్నేహితుడి పెళ్లిలో సల్మాన్ ఖాన్.. వీడియో
ఇక సినిమాల విషయానికొస్తే సల్మాన్ చివరిసారిగా సికందర్ లో కనిపించారు. రంజాన్ కానుకగా మే30న విడుదలైన ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. అలాగే కాజల్ అగర్వాల్, సత్యరాజ్, శర్మన్ జోషి, ప్రతీక్ బబ్బర్, అంజిని ధావన్,జతిన్ సర్నా కూడా ప్రధాన పాత్రల్లో నటించారు. సల్మాన్ ఖాన్ స్నేహితుడు సాజిద్ నదియావాలా భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మించారు. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన సికందర సినిమా ఇవాళ్టి నుంచే నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమిగ్ అవుతోంది.
Ab hoga dhamaka on every level 👊💥 Kyunki Netflix par aa gaya hai Sikandar ❤️🔥
Watch Sikandar, out now on Netflix. #SikandarOnNetflix pic.twitter.com/Sdo61HaD8R— Netflix India (@NetflixIndia) May 25, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..