
బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన ‘యానిమల్’ సినిమా 2023లో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది.బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 900 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. అయితే ఈ యానివల్ సినిమా విజయంతో పాటు వివాదాలను కూడా ఎదుర్కొంది. ఈ సినిమాలో హింస ఎక్కువగా ఉంది. పురుషాధిక్యత కనిపిస్తోంది. మహిళలను తక్కువగా చేసి చూపించారని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పై విమర్శలు వచ్చాయి. అయితే ఈ డైనిమిక్ డైరెక్టర్ ఈ విమర్శలను పట్టించుకోలేదు. అంతేకాదు ‘యానిమల్’ సినిమాకి సీక్వెల్ తీస్తానని కూడా ప్రకటించాడు. ఇప్పుడీ క్రేజీ ప్రాజెక్టు గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వచ్చింది. హీరో రణ్‌బీర్ కపూర్ ‘యానిమల్’ సీక్వెల్ షూటింగ్ గురించి మాట్లాడాడు. ‘దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం మరో సినిమా (ప్రభాస్ స్పిరిట్) బిజీగా ఉన్నాడు. ఆ సినిమా పూర్తయిన తర్వాత, ‘యానిమల్ పార్క్’ ప్రారంభమవుతుంది. బహుశా ఈ సినిమా షూటింగ్ 2027లో ప్రారంభం కావచ్చు’ అని చెప్పుకొచ్చాడు రణ్ బీర్ కపూర్.
సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి ‘స్పిరిట్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆ చిత్రం తర్వాత రణ్‌బీర్ కపూర్‌తో కలిసి ‘యానిమల్ పార్క్’ చిత్రాన్ని ప్రారంభిస్తారు. కాగా ‘యానిమల్’ చిత్రం చివర్లో ‘యానిమల్ పార్క్’ చిత్రం గురించి హింట్ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగా. అంతేకాదు మొదటి పార్ట్ కంటే రెండో భాగం మరింత వయలెంట్ గా ఉంటుందని కూడా చెప్పారు. ఇక ప్రస్తుతం రణబీర్ కపూర్ ‘రామాయణం’ సినిమాతో బిజీగా ఉన్నాడు. దీనితో పాటు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ‘లవ్ అండ్ వార్’ సినిమాలో కూడా నటిస్తున్నాడు. ‘రామాయణం’ సినిమా మొదటి భాగం నవంబర్ 06న విడుదల కానుంది. ఆ తర్వాత ‘లవ్ అండ్ వార్’ సినిమా ఫిబ్రవరి 2027లో విడుదల కానుంది. దీని తర్వాత రణబీర్ కపూర్ ‘బ్రహ్మాస్త్ర 2’, ‘యానిమల్ పార్క్’ సినిమాల్లో నటిస్తారు.
#RanbirKapoor about #AnimalPark
– #SandeepReddyVanga another film right now (#spirit), we should start the film in 2027.
– #SRV wants to make the film on 3 parts, the 2nd part is called animal park.
– it is very exciting because now I want to play two characters antagonist and… pic.twitter.com/Yun8GhKpEv
— Movie Verse (@_MovieVerse) January 26, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.