Sourav Ganguly: తెరపైకి సౌరవ్‌ గంగూలీ బయోపిక్.. దాదాగా కనిపించనున్న ఆ స్టార్ హీరో

|

Jan 24, 2025 | 12:02 PM

భారత క్రికెట్ జట్టు అత్యుత్తమ ఆటగాళ్లలో సౌరవ్ గంగూలీ ఒకరు. కేవలం ఆటగాడినే కాకుండా కెప్టెన్ గానూ సత్తా చాటాడీ బెంగాల్ టైటర్. గంగూలీ కెప్టెన్సీలోనే భారత జట్టు విదేశీ గడ్డపై పోరాడి గెలవడం నేర్చుకుంది. దాదా నాయకత్వంలోనే టీమిండియా 2003 వరల్డ్ కప్‌లో ఫైనల్ కు కూడా చేరుకుంది.

Sourav Ganguly: తెరపైకి సౌరవ్‌ గంగూలీ బయోపిక్.. దాదాగా కనిపించనున్న ఆ స్టార్ హీరో
Sourav Ganguly Biopic
Follow us on

టీమిండియా అత్యుత్తమ కెప్టెన్లలో సౌరవ్ గంగూలీ అని చెప్పవచ్చు. అతను భారత క్రికెట్ జట్టు రూపు రేఖలన్నీ మార్చేశాడు. మహేంద్ర సింగ్ ధోని, యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ వంటి స్టార్ ప్లేయర్లను జట్టులోకి తీసుకొచ్చాడు. గంగూలీ కెప్టెన్సీలోనే భారత జట్టు దూకుడు నేర్చుకుంది. విదేశీ గడ్డపై సత్తా చాటింది. ఇలా ఆటగాడిగా, నాయకుడిగా భారత క్రికెట్ జట్టు కు సేవలు అందించిన సౌరవ్ గంగూలీ జీవితంపై ఓ సినిమా తెరకెక్కనుంది. బాలీవుడ్ ప్రముఖ నటుడు రాజ్‌కుమార్ రావ్ దాదా పాత్రను పోషించవచ్చని తెలుస్తోంది.ఈ ట్యాలెంటెడ్ నటుడు రీసెంట్‌గా స్త్రీ 2 సినిమాలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మొత్తం 800 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. ఇక గతేడాది ప్రముఖ పారిశ్రామికవేత్త, బొల్లాంట్‌ ఇండస్ట్రీస్‌ వ్యవస్థాపకుడు శ్రీకాంత్‌ బొల్లా జీవితం ఆధారంగా తెరకెక్కిన శ్రీకాంత్ సినిమాలో రాజ్ కుమార్ రావు అద్భుతంగా నటించాడు. ఈ నేపథ్యంలోనే భారత జట్టులో దాదాగా పేరొందిన సౌరవ్ గంగూలీ బయోపిక్‌లో ఈ స్టార నటుడు నటించవచ్చని ప్రచారం జరుగుతోంది.

గంగూలీ జీవితంపై రూపొందుతున్న ఈ చిత్రాన్ని లవ్ రంజన్ నిర్మించబోతున్నారని తెలుస్తోంది. విక్రమాదిత్య మోత్వానే ఈ చిత్రానికి దర్శకత్వం వహించవచ్చు. 2021లో ఈ బయోపిక్‌ని స్వయంగా ఆయనే ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

రాజ్‌కుమార్ రావు కంటే ముందు, సౌరవ్ గంగూలీ బయోపిక్ రేసులో నటించేందుకు ఇద్దరు బాలీవుడ్ సూపర్ స్టార్ల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. ఆయుష్మాన్ ఖురానా, రణబీర్ కపూర్‌లను దాదా పాత్ర కోసం సంప్రదిచారట. మొదట ఆయుష్మాన్ కు ఈ సినిమా గురించి చెప్పారు. అతను కూడా టించేందుకు అధికారికంగా సంతకం కూడా చేశాడు. కానీ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆయుష్మాన్ తప్పుకున్నాడు. దీని తర్వాత రణబీర్ కపూర్ పేరు లైన్ లోకి వచ్చింది. ఓ సినిమా ప్రమోషనలో గంగూలీతో కలిసి కనిపించాడీ చాక్లెట్ బాయ్. దీంతో దాదాగా రణ్ బీర్ నే యాక్ట్ చేస్తాడని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు అనూహ్యంగా రాజ్ కుమార్ రావ్ పేరు తెరపైకి వచ్చింది.

గంగూలీగా రాజ్ కుమార్ రావు.. త్వరలోనే ప్రకటన..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.