Pankaj Tripathi: ‘మీర్జాపూర్’ నటుడి ఇంట తీవ్ర విషాదం.. తండ్రి మరణం నుంచి తేరుకోకముందే ..
బాలీవుడ్ ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠి ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొన్ని నెలల క్రితమే ఆయన తండ్రి కన్నుమూశారు. దీని నుంచి తేరుకోకముందే పంకజ్ కుటుంబంలో మరో విషాదం నెలకొంది. పంకజ్ త్రిపాఠి ..
బాలీవుడ్ ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠి ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొన్ని నెలల క్రితమే ఆయన తండ్రి కన్నుమూశారు. దీని నుంచి తేరుకోకముందే పంకజ్ కుటుంబంలో మరో విషాదం నెలకొంది. పంకజ్ త్రిపాఠి బావమరిది రాకేశ్ తివారీ ఘోర కారు ప్రమాదంలో కన్నుమూశాడు. ఇదే ప్రమాదంలో గాయపడిన పంకజ్ త్రిపాఠి సోదరి సరిత తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. శనివారం (ఏప్రిల్ 20) సాయంత్రం నాలుగు గంటల సమయంలో జార్ఖండ్‌లో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్వార్త విన్న పంకజ్ త్రిపాఠి కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు పంకజ్ త్రిపాఠి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. దీనిని అధిగమించేలా దేవుడు వారికి మనో ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుతున్నారు. వివరాల్లోకెళితే.. భార్యతో కలిసి ప్రత్యేక వాహానంలో బిహార్ నుంచి పశ్చిమ బెంగాల్ కు బయలుదేరాడు రాకేష్. ఢిల్లీ – కోల్‌కతా జాతీయ రహదారిపై వారు వేగంగా ప్రయాణిస్తుండగా.. అది చౌరస్తా మలుపు దగ్గర కారు అదుపు తప్పింది. వేగంగా వెళ్లి డివైడర్ ను బలంగా ఢీకొట్టింది.
బావ దుర్మరణం.. ఐసీయూలో సోదరి..
ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాద తీవ్రతకు రాజేష్ తివారీ, సరితకు తీవ్ర గాయాలయ్యాయి. కారులో ఇరుక్కున్న వారిని స్థానికుల సహాయంతో పోలీసులు బయటకు తీశారు. ప్రమాదం తర్వాత రాజేష్ తివారీ, సరితా తివారీలను ధన్‌బాద్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్చారు. అప్పటికి రాజేష్ తివారీ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సరితా తివారీ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో పంకజ్ త్రిపాఠి ఇంట్లో విషాద వాతావరణం నెలకొంది.
As per reports, #PankajTripathi‘s brother-in-law #RajeshTiwari has passed away in a road accident in Jharkhand. His sister #SaritaTiwari has sustained serious injuries. pic.twitter.com/4zYjkecYb2
— Sonu Yadav (@_Yadav_Saab) April 21, 2024
తండ్రి మరణం నుంచి తేరుకోకముందే..
పంకజ్ త్రిపాఠి బావ రాజేష్ తివారీ రైల్వే శాఖలో పనిచేస్తున్నారు. చిత్తరంజన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. తన గ్రామం నుంచి చిత్తరంజన్‌కు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. పంకజ్ త్రిపాఠి తండ్రి ఆగస్టు 2023లో మరణించారు. ఆ బాధ మరిచిపోకముందే అతని కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. సరితా తివారీ త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్థిస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.