Ananya Panday : ఇదేం సినిమా షూటింగ్ కాదు ఆలస్యంగా రావడానికి.. అనన్య పై సీరియస్ అయిన ఎన్సీబీ అధికారులు..

క్రూయిజ్ డ్రగ్స్ వ్యవహారం రోజు రోజు ముదురుతోంది.. డ్రగ్స్ ఎపిసోడ్ కు సంబంధించి కూపీ లాగే పనిలో ఉన్నారు ఎన్సీబీ అధికారులు.

Ananya Panday : ఇదేం సినిమా షూటింగ్ కాదు ఆలస్యంగా రావడానికి.. అనన్య పై సీరియస్ అయిన ఎన్సీబీ అధికారులు..
Ananya

Updated on: Oct 24, 2021 | 8:05 AM

Ananya Panday : క్రూయిజ్ డ్రగ్స్ వ్యవహారం రోజు రోజు ముదురుతోంది.. డ్రగ్స్ ఎపిసోడ్ కు సంబంధించి కూపీ లాగే పనిలో ఉన్నారు ఎన్సీబీ అధికారులు. ఇప్పటికే బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనయుడు ఈ కేసులో అడ్డంగా బుక్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆర్యన్ ఖాన్ జైలు  జీవితం అనుభవిస్తున్నాడు. అయితే అధికారుల విచారణలో హీరోయిన్ అనన్య పాండే పేరు బయటకు రావడంతో ఇప్పుడు ఈ అమ్మడిని విచారిస్తున్నారు అధికారులు. ఆర్యన్ సెల్ ఫోన్ ను విశ్లేషించే క్రమంలో.. నటి అనన్య పాండేతో జరిగిన వాట్సాప్ చాట్ వెల్లడైంది. ఇప్పటికే అనన్య ఇంటి పై ఎన్సీబీ అధికారులు దాడులు చేశారు. అలాగే ఇటీవల ఒకసారి విచారణకు కూడా పిలిచారు. తాజాగా మరో సారి ఈ అమ్మడు ఎన్సీబీ అధికారుల ముందు హాజరయ్యింది.

గురువారం అనన్య పాండేను అధికారులు విచారణ హాజరుకావాల్సిందిగా ఆదేశించారు. దాంతో ఆమె ఎన్సీబీ అధికారుల ముందు హాజరయ్యింది.  రెండు గంటల పాటు విచారణ అనంతరం.. శుక్రవారం ఉదయం 11 గంటలకు మరోసారి రావాలని ఆదేశించారు. అయితే అధికారులు ఆదేశాలను అనన్య లెక్కచేయలేదు. విచారణకు ఆమె ఏకంగా నాలుగు గంటలు ఆలస్యంగా వచ్చింది. దాంతో విచారణ అధికారులుఆమెపై సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. ఇదేం సినిమా షూటింగ్ కాదు.. ప్రొడక్షన్ హౌస్ కాదు.. ఆలస్యంగా రావడానికి అంటూ ఆమె పై ఫైర్ అయ్యారని తెలుస్తుంది. అయితే శుక్రవారం అనన్యను దాదాపు నాలుగు గంటల పాటు విచారించిన అధికారులు.. ఆర్యన్ ఖాన్ తో జరిపిన చాటింగ్ గురించి ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో బెస్ట్ కపుల్‌‌‌‌గా ఆ ఇద్దరు కంటెస్టెంట్స్.. వాళ్ళు ఎవరంటే..

Nivetha Thomas: వావ్.. అరుదైన ఫీట్ సాధించిన నేచురల్ బ్యూటీ నివేదా థామస్.. కష్టానికి సలామ్ కొట్టాల్సిందే..!

Maa Elections 2021: ప్రకాష్ రాజ్ ప్యానెల్‌తోపాటు నాగబాబు రాజీనామాను తిరస్కరించిన ఈసీ..